- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పశువులకు గాలికుంటు టీకాలు వేయించాలి : మున్సిపల్ చైర్ పర్సన్ వీసారపు ప్రగతి శ్రీపాల్ రెడ్డి
'నాటి నుంచి నేటి వరకు పాడి సంపదతోనే పర్యావరణ సమతుల్యం జరుగుతుందని, రైతు దైనందిన జీవితంలో పాడి సంపద అత్యంత కీలకమని వాటిని కాపాడుకోవాటం మానవాళి బాధ్యత' అని మున్సిపల్ చైర్ పర్సన్ వీసారపు ప్రగతి శ్రీపాల్ రెడ్డి అన్నారు.

దిశ, మరిపెడ : 'నాటి నుంచి నేటి వరకు పాడి సంపదతోనే పర్యావరణ సమతుల్యం జరుగుతుందని, రైతు దైనందిన జీవితంలో పాడి సంపద అత్యంత కీలకమని వాటిని కాపాడుకోవాటం మానవాళి బాధ్యత' అని మున్సిపల్ చైర్ పర్సన్ వీసారపు ప్రగతి శ్రీపాల్ రెడ్డి అన్నారు. మంగళవారం జిల్లా పశువైద్య, పశు సంవర్ధక శాఖ, జిల్లా అధికారి కిరణ్ కుమార్ ఆధ్వర్యంలో మరిపెడ మున్సిపల్ కార్యాలయంలో జరిగిన గాలి కుంటు వ్యాక్సినేషన్ కార్యక్రమానికి మండల అధ్యక్షుడు పెళ్లి రఘువీరారెడ్డితో కలిసి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. అనంతరం పశువుల ప్రాముఖ్యతపై అవగాహన కల్పించి, పాడి రైతులకు ఉన్న సందేహాలను నివృతి చేశారు. నెల రోజుల పాటు జరిగే ఈ కార్యక్రమ కార్యచరణకు సంబంధించి కరపత్రాలను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు షేక్ తాజోద్దీన్, వైస్ చైర్మన్ కాలం సునీత రవీందర్ రెడ్డి, వార్డు కౌన్సిలర్లు మెరుగు రాము, ఇస్లావత్ తిరుపతి, జాటోలతు సురేష్, లూనవత్ రమేష్, గుగులోతు నీల, కాంతమ్మ, గంట్ల గౌతమ్ రెడ్డి, భూక్య బేబీ, సత్యవతి, మాజీ సర్పంచ్ రాంలాల్, మున్సిపల్ కమిషనర్ విజయానంద్, ఎడ్జెర్ల క్లస్టర్ పశు వైద్యాధికారి కృష్ణ మనోహర్, కాంగ్రెస్ నాయకులు కొంపెల్లి సురేందర్ రెడ్డి, మైనార్టీ నాయకులు, ఉపేందర్, అఫ్జల్ పాల్గొన్నారు.






