- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కమిషన్ ఇస్తేనే కాసులు.. రూ.200 కొడితే రూ.1800..!
కంచే చేను మేసింది అన్న చందంగా తయారైంది కొంత మంది ఉపాధి హామీ పనుల తాలూక అధికారుల తీరు.

దిశ, డోర్నకల్: కంచే చేను మేసింది అన్న చందంగా తయారైంది కొంత మంది ఉపాధి హామీ పనుల తాలూక అధికారుల తీరు. నిరుపేదలకు పని కల్పించి వారిని ఆదువాలని కేంద్ర ప్రభుత్వం క్షేత్ర స్థాయిలో కొందరు అవినీతి పరులకు వరంగా మారుతోంది. అమాయక నిరక్ష్యరాస్య కూలీలే ఆదాయ వనరులుగా మార్చుకుని కొంత మంది మేట్లు లక్షలు గడిస్తున్నట్లో ఆరోపణలొస్తున్నాయి. డోర్నకల్ మండలంలోని పలు గ్రామాల్లో పని చేస్తున్న ఒక్కో ఉపాధి కూలీ వద్ద రూ.100కమీషన్‌కు 1150 పేమెంట్, 200 వసూలు చేస్తూ తిరిగి వారికి రూ.1800కొడుతున్నట్లు తెలుస్తోంది .ఈ తతంగం అంతా కొంతమంది అధికారుల కనుసన్నల్లోనే జరుగుతున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి.
పని చేయకున్నా కొలతలు..
జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పనుల్లో కూలీల నుంచి వారానికి రూ.100 నుంచి 200 వరకు అక్రమ పశువులకు పాల్పడుతున్నారనే ఆరోపణలు క్షేత్రస్థాయిలో తీవ్ర కలకలం రేపుతున్నాయి. మస్టర్లు నమోదు చేయడానికి, కొలతలు ఆన్‌లైన్‌లో ఎక్కించడానికి మేట్లు (ఫీల్డ్ అసిస్టెంట్లు), సాంకేతిక సహాయకులు (టెక్నికల్ అసిస్టెంట్లు) ఈ అక్రమాలకు పాల్పడుతున్నట్లు పలువురు కూలీలు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
మామూళ్లు ఇస్తేనే మస్టర్లు..
పనులు కల్పించడం, మస్టర్లలో పేర్లు నమోదు చేయడం, ఆన్‌లైన్ సిస్టమ్‌లో వివరాలు నమోదు చేయడానికి గాను కూలీల నుండి ప్రతి వారం డబ్బులు డిమాండ్ చేస్తున్నారు. డబ్బులు ఇవ్వని కూలీల పనుల కొలతలను కావాలనే తగ్గించి రికార్డు చేయడం, వేతనాల్లో కోత విధించడం లేదా వారికి అసలు పనులు అప్పగించకపోవడం వంటి వేధింపులకు గురిచేస్తున్నారు. టెక్నికల్ అసిస్టెంట్లు పని ప్రదేశానికి వెళ్లి సరైన కొలతలు తీసుకోకుండా, ఆఫీసుల్లో కూర్చొని ఇష్టానుసారంగా రికార్డులు నమోదు చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఈ అక్రమాలపై ఉన్నతాధికారులకు ఫిర్యాదులు అందుతున్నప్పటికీ, క్షేత్రస్థాయిలో ఎలాంటి కఠిన చర్యలు తీసుకోవడం లేదని బాధితులు వాపోతున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి కమీషన్లకు పాల్పడున్న వారిని గుర్తించి రికవరీ చేయాలని ప్రజలు కోరుతున్నారు.
ఎంక్వయిరీ చేసి కఠిన చర్యలు తీసుకుంటాం: ఏపీవో పార్థసారథి
ఉపాధి హామీ పథకం పేదలు ఆర్థిక వృద్ధికి తోడ్పడే లక్ష్యంగా కొనసాగుతుంది. కూలీలకు ప్రభుత్వాలు అందించే సౌకర్యాలు కల్పించాల్సిన బాధ్యత గ్రామపంచాయతీ, సిబ్బందిపై ఉంది. మండలంలో ఉపాధి హామీ పనుల్లో అక్రమాలు చోటు చేసుకుంటున్నట్లు వస్తున్న ఆరోపణలపై ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లి సమగ్ర విచారణ జరిపి నిబంధనల ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటాం.






