వివాహితపై లైంగిక దాడి యత్నం..వ్యక్తిపై కేసు నమోదు

by velandi.Saikiran |

వివాహిత ఫిర్యాదు మేరకు కొత్తగూడ గ్రామానికి చెందిన తీగల వీరస్వామి అలియాస్ ప్రేమ్ సాగర్ (40)పై కేసు నమోదు చేసినట్లు సోమవారం ఎస్సై రాజ్‌కుమార్ తెలిపారు.

వివాహితపై లైంగిక దాడి యత్నం..వ్యక్తిపై కేసు నమోదు
X

దిశ, కొత్తగూడ: మండల కేంద్రానికి చెందిన ఓ వివాహిత ఫిర్యాదు మేరకు కొత్తగూడ గ్రామానికి చెందిన తీగల వీరస్వామి అలియాస్ ప్రేమ్ సాగర్ (40)పై కేసు నమోదు చేసినట్లు సోమవారం ఎస్సై రాజ్‌కుమార్ తెలిపారు. ఎస్సై రాజ్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. శుక్రవారం భర్త ఇంట్లో లేని సమయంలో నిందితుడు మహిళక‌పై లైంగిక దాడి యత్నించాడు. దీంతో మహిళ గట్టిగా కేకలు వేయగా, ఆ అరుపులు విని ఆమె భర్త అక్కడికి చేరుకున్నట్లు తెలిపారు. భర్త రావడంతో నిందితుడు అక్కడి నుంచి పరారైనట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. బాధిత మహిళ ఫిర్యాదు మేరకు నిందితుడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు ఎస్సై వెల్లడించారు.

Next Story