- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కారు, బైక్ ఢీ, ఓ వ్యక్తికి గాయాలు
కారు ఢీకొని ద్విచక్ర వాహనదారుడు గాయాల పాలైన ఘటన ములుగు జిల్లా కన్నాయిగూడెం మండలంలోని బుట్టాయిగూడెం గ్రామ శివారులో చోటు చేసుకుంది.

దిశ, కన్నాయిగూడెం : కారు ఢీకొని ద్విచక్ర వాహనదారుడు గాయాల పాలైన ఘటన ములుగు జిల్లా కన్నాయిగూడెం మండలంలోని బుట్టాయిగూడెం గ్రామ శివారులో చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం బుట్టాయిగూడెం గ్రామానికి చెందిన బొలిశెట్టి సాంబయ్య తన వ్యవసాయ పొలం దగ్గరకు టూ వీలర్ పై వెళ్లాడు. అయితే, మోటార్ ఆన్ చేసి తిరిగి వస్తున్న క్రమంలో ప్రమాదం జరిగింది.
ముప్పనపల్లి గ్రామానికి చెందిన వనపర్తి రామయ్య ఏటూరు నాగారం వైపుగా TG 37 2471 కారును అతివేగంగా నడుపుతూ టూ వీలర్ పై ప్రయాణిస్తున్న బొలిశెట్టి సాంబయ్య ద్విచక్ర వాహనాన్ని ఢీ కొట్టాడు. ఈ తరుణంలోనే టూవీలర్ వ్యక్తికి గాయాలు అయ్యాయి. అక్కడే ఉన్న స్థానికులు... 108 వాహనం ద్వారా ఏటుర్ నాగారం సామాజిక వైద్యశాలకు తరలించారు. పరిస్థితి విషమించడంతో మెరుగైన వైద్యం కోసం హన్మకొండ లోని ఓ ఫ్రైవేట్ హాస్పిటల్ కి తరలించారు.






