అభ్యర్థులు బ్యాంకు ఖాతాలు వెంటనే ప్రారంభించాలి

by Bhanu |

గ్రామ పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేయు అభ్యర్థులు ఎన్నికల వ్యయ వివరాల కోసం నూతన బ్యాంక్ ఖాతా ప్రారంభించడంలో ఆలస్యం జరగకుండా తక్షణ చర్యలు తీసుకోవాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ రాహుల్ శర్మ బ్యాంకర్లకు ఆదేశాలు జారీ చేశారు.

అభ్యర్థులు బ్యాంకు ఖాతాలు వెంటనే ప్రారంభించాలి
X

దిశ భూపాలపల్లి ప్రతినిధి : గ్రామ పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేయు అభ్యర్థులు ఎన్నికల వ్యయ వివరాల కోసం నూతన బ్యాంక్ ఖాతా ప్రారంభించడంలో ఆలస్యం జరగకుండా తక్షణ చర్యలు తీసుకోవాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ రాహుల్ శర్మ బ్యాంకర్లకు ఆదేశాలు జారీ చేశారు. ఎన్నికల ఖర్చులు నమోదు చేయుటకు ప్రత్యేక బ్యాంక్ ఖాతా తప్పనిసరి అని, ఈ ప్రక్రియలో జాప్యం అభ్యర్థులకు ఇబ్బందులు కలిగిస్తోందని ఆయన పేర్కొన్నారు. ఎల్డీఎంకు నిర్వహించిన సమావేశంలో మాట్లాడుతూ.. పోటీ అభ్యర్థుల కోసం ఖాతాల ప్రారంభంలో కనిపిస్తున్న ఆలస్యాన్ని అధిగమించి, వేగవంతంగా సేవలు అందించాలని బ్యాంకర్లను కోరారు. ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ప్రతి అభ్యర్థి తప్పనిసరిగా ప్రత్యేక బ్యాంక్ ఖాతా తెరవాలని ఆయన గుర్తుచేశారు.

ముఖ్య సూచనలు..

1. ఎన్నికల ఖర్చుల కోసం ప్రారంభించే ఖాతా తప్పనిసరిగా అదే బ్యాంక్‌లోనే ఉండాల్సిన అవసరం లేదు, ఇతర జాతీయేత‌ర‌ బ్యాంకుల్లో కూడా తెరిచుకోవచ్చు.

2. ఇప్పటికే ఉన్న బ్యాంక్ శాఖలు కొత్త ఖాతా ఇవ్వలేని పరిస్థితిలో, అదే బ్యాంక్ తక్షణమే కరెంట్ అకౌంట్ సౌకర్యం కల్పించాలి.

3. బ్యాంకులు ఎన్నికల అభ్యర్థులకు ప్రాధాన్యతా ప్రాతిపదికన ఖాతాలు ప్రారంభించేందుకు జిల్లా స్థాయి బ్యాంకర్ల సమన్వయ కమిటీ (LDM) ద్వారా సమగ్ర సూచనలు జారీ చేయాలి.

ఎన్నికల ప్రక్రియ సజావుగా సాగేందుకు అన్ని బ్యాంకులు సమన్వయంతో పనిచేయాలని ఎంపీడీఓ, ఎంపీటి‌సీలు, సంబంధిత అధికారులతో కలసి చర్యలు తీసుకోవాలని కలెక్టర్ రాహుల్ శర్మ సూచించారు.

Next Story