Medaram Jatara 2026 : మేడారం లో వనం (వెదురు కర్రలను) గద్దె పై ప్రతిష్టించిన గిరిజన భక్తులు

by Taduka Kalyani |   (  Updated:2026-01-29 11:03:23  IST  )

ఆసియాలో అతిపెద్ద జాతర శ్రీ మేడారం సమ్మక్క సారలమ్మ జాతరలో నిన్న రాత్రి సారలమ్మ గద్దెకు చేరగా నేడు సమ్మక్క తల్లి చిలుకల గుట్ట నుంచి గద్దెల వద్దకు చేరుకోనుంది.

Medaram Jatara 2026 : మేడారం లో వనం (వెదురు కర్రలను) గద్దె పై ప్రతిష్టించిన గిరిజన భక్తులు
X

దిశ, మేడారం న్యూస్ నెట్వర్క్ : ఆసియాలో అతిపెద్ద జాతర శ్రీ మేడారం సమ్మక్క సారలమ్మ జాతరలో నిన్న రాత్రి సారలమ్మ గద్దెకు చేరగా నేడు సమ్మక్క తల్లి చిలుకల గుట్ట నుంచి గద్దెల వద్దకు చేరుకోనుంది. సమ్మక్క రాక సందర్భంగా ముందుగా వనం (వెదురు కర్రలను) గద్దె పై ప్రతిష్టించారు. జాతరలో వనం ( వెదురు) కు విశిష్టత ఉంది. వనం అంటే ఆదివాసీ భాషలో అడవి అని అర్థం. ఈ వనం నుంచి తల్లులు గద్దెల పైకి వస్తారు కాబట్టి ముందుగా ఏపుగా ఎదిగిన వెదురు కర్రను ఆదివాసీ సంప్రదాయం ప్రకారం ప్రత్యేక పూజలు నిర్వహించి సమ్మక్క గద్దెల వద్దకు తీసుకు వచ్చి గద్దె పై ప్రతిష్టిస్తారు. వనం (వెదురు) తీసుకు వచ్చిన తర్వాత చిలుకల గుట్ట నుంచి సమ్మక్క ను తీసుకు వస్తారు.

Next Story