ఈనెల 27 నుంచి మేడారానికి బ‌స్సులు

by Nallavelli.Anjaneyulu |

మేడారం మహా జాతర మేడారంకు ఈ నెల 27 నుంచి మణుగూరు డిపో నుండి ఆర్టీసీ బస్సులు నడపనున్నట్లు డిపో మేనేజర్ శ్యాంసుందర్ తెలిపారు.

ఈనెల 27 నుంచి మేడారానికి బ‌స్సులు
X

దిశ, మంగపేట : మేడారం మహా జాతర మేడారంకు ఈ నెల 27 నుంచి మణుగూరు డిపో నుండి ఆర్టీసీ బస్సులు నడపనున్నట్లు డిపో మేనేజర్ శ్యాంసుందర్ తెలిపారు. బుదవారం ఆయన దిశతో మాట్లాడుతూ తెలంగాణ కుంభమేళగా పేరొందిన మేడారం జాతర రద్దీని దృష్టిలో పెట్టుకుని ఈ నెల 27 నుంచి మణుగూరు డిపో బస్సులను మంగపేట నుంచి నడపనున్నట్లు తెలిపారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని కొత్తగూడెం, మణుగూరు ఆర్టీసీ డిపోల నుండి సుమారు 27 బస్సులతో ప్రయాణీకులను మేడారం చేరవేయనున్నట్లు తెలిపారు. మంగపేట నుంచి రూ.110 రూపాయలుగా టికెట్ ను నిర్ణయించామని, ప్రయాణీకులు ఆర్టీసీని ఆదరించి బస్సుల్లో సుఖవంతమైన ప్రయాణం చేయాలన్నారు.

Next Story