స్వస్థలానికి జవాన్ మృత్యదేహం.. బోరున విలపించిన తల్లిదండ్రులు

by Bhanu |

జమ్మూకాశ్మీర్ లోని సాంబా సెక్టార్ లో విధులు నిర్వర్తిస్తున్న బీఎస్ఎఫ్ జవాన్ మూడు రోజుల కిందట తుపాకీతో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే.

స్వస్థలానికి జవాన్ మృత్యదేహం.. బోరున విలపించిన తల్లిదండ్రులు
X

దిశ, నర్సంపేట: జమ్మూకాశ్మీర్ లోని సాంబా సెక్టార్ లో విధులు నిర్వర్తిస్తున్న బీఎస్ఎఫ్ జవాన్ మూడు రోజుల కిందట తుపాకీతో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో జవాన్ సంపంగి నాగరాజు మృతదేహాన్ని ఆర్మీ అధికారులు మంగళవారం వరంగల్ జిల్లా లోని అతని స్వస్థలమైన నర్సంపేటకు తీసుకువచ్చారు. నర్సంపేట పట్టణానికి చెందిన సంపంగి విజయ,మల్లయ్య దంపతులకు ముగ్గురు కుమారులు. వీరిలో నాగరాజు చిన్న కుమారుడు. ఇతనికి 2016లో బీఎస్ఎఫ్ కానిస్టేబుల్ గా ఉద్యోగం వచ్చింది. నాటి నుండి దేశంలోని వివిధ ప్రాంతాల్లో విధులు నిర్వర్తించారు. మార్చి నెలలో సెలవులపై ఇంటికి వచ్చిన నాగరాజు ఏప్రిల్ 23న తిరిగి విధులకు వెళ్లినట్లు తెలుస్తోంది. గడచిన మూడేళ్ళుగా జమ్మూకాశ్మీర్ సరిహద్దుల్లో గల సాంబా సెక్టార్ లో డ్యూటీ చేస్తున్నట్లు సమాచారం. విధుల్లో ఒత్తిడి వల్ల అంటూ కొందరు కుటుంబ కలహాలు అంటూ మరికొందరు నాగరాజు ఆత్మహత్య చేసుకోవడంపై చర్చిస్తున్నారు.

Next Story