స్థానిక ఎన్నిక‌ల గెలుపు బీఆర్ఎస్ దే

by Bhanu |

స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో పాలకుర్తి, దేవరుప్పు మండల బిఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తల సమావేశం నిర్వ‌హించారు.

స్థానిక ఎన్నిక‌ల గెలుపు బీఆర్ఎస్ దే
X

దిశ, పాలకుర్తి : స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో పాలకుర్తి, దేవరుప్పు మండల బిఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తల సమావేశం నిర్వ‌హించారు. ఈ స‌మావేశానికి ముఖ్య అతిథిగా మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు హాజ‌ర‌య్యారు. ఈ సందర్భంగా ఎర్రబెల్లి మాట్లాడుతూ ..కష్ట కాలంలో మనవెంబడి ఉన్నవారే మన వారనీ, రాష్ట్రంలోని సర్వేలన్నీ మన వైపే ఉన్నాయనీ, బీసిలను మెాసం చేసిందే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అని మండిప‌డ్డారు. రాష్ట్రం ఒక అసమర్థ నాయకుడి చేతిలో పడి నాశనం అవుతుందనీ, యూరియా కొరత వచ్చింది అంటే అసమర్ధ ప్రభుత్వ పాలన వ‌ల్ల‌నే అని, గత కెసిఆర్ ప్రభుత్వ హయంలో రారాజుగా బ్రతికిన రైతులు కాంగ్రెస్ పాలనలో పస్థులుండాల్సిన పరిస్థితి వచ్చిందనీ విరుచుకుప‌డ్డారు. మండలంలోనీ ప్రతి నాయకుడు ప్రతి ఒక్క కార్యకర్తని కలుపుకొని పోయి పార్టీ గెలుపు కోసం ప్రతి ఒక్కరు కష్టపడాలని సూచించారు. రాష్ట్రంలో ఎప్పుడు ఎన్నికల వచ్చినా కేసీఆర్ ముఖ్యమంత్రి అని, ఈ బోగస్ ప్రభుత్వం చేసిన బోగస్ హామీలను ప్రతి గడప గడపకు ప్రజలకు అర్థమయ్యే రీతిలో ప్రచారం చేయాలని, స్థానిక సంస్థల ఎన్నికల్లో 90% బీఆర్ఎస్ పార్టీ గెలుపొందుతామన్నారు. ఈ కార్యక్రమంలో దేవరుప్పుల, పాలకుర్తి మండలంలోని బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, ఉపాధ్యక్షులు, తాజా, మాజీ ముఖ్య నాయకులు, గ్రామ ఇంచార్జీలు, మండలంలోని ప్రతి గ్రామ పంచాయతీలలో యూత్ & సోషల్ మీడియా నాయకుల పాల్గొన్నారు.

Next Story