- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సర్వర్ నిర్వహణతో మూడు రోజులు నిలువనున్న రిజిస్ట్రేషన్ సేవలు..
by Taduka Kalyani |
తెలంగాణ స్టాంప్స్ & రిజిస్ట్రేషన్ శాఖ చేపట్టనున్న సర్వర్ నిర్వహణ పనుల నేపథ్యంలో మూడు రోజులపాటు రిజిస్ట్రేషన్ సేవలు నిలవనున్నాయి.

X
దిశ, ఆర్మూర్ : తెలంగాణ స్టాంప్స్ & రిజిస్ట్రేషన్ శాఖ చేపట్టనున్న సర్వర్ నిర్వహణ పనుల నేపథ్యంలో మూడు రోజులపాటు రిజిస్ట్రేషన్ సేవలు నిలవనున్నాయి. ఈనెల 26వ తేదీ నుంచి 28వ తేదీ వరకు రాష్ట్రవ్యాప్తంగా రిజిస్ట్రేషన్ సేవలు నిలిపివేనున్నట్లు తెలిసింది. సర్వర్ నిర్వహణలో భాగంగా ఈనెల 26వ తేదీన మెటా డేటా బదిలీ, 27వ తేదీన సిస్టం అప్డేట్లు, 28న ఇతర సాంకేతిక పనులను రిజిస్ట్రేషన్ శాఖ స్టాంప్స్ అధికారులు చేయనున్నట్లు తెలిసింది. ఈ మూడు తేదీల్లో రిజిస్ట్రేషన్లు చేసుకునేందుకు స్లాట్ బుక్ చేసుకున్న సదరు వ్యక్తులు తేదీలను మార్చుకొని మరల స్లాట్ బుకింగ్ చేసుకోవాలని అధికారులు తెలుపుతున్నారు. ఈ నెల 29వ తేదీ నుంచి రిజిస్ట్రేషన్ సేవలు యధావిధిగా అందుబాటులో ఉంటాయని తెలిసింది.
Next Story






