కాసులకు కక్కుర్తి పడే వ్యక్తి కడియం శ్రీహరి

by velandi.Saikiran |

కాంట్రాక్టర్లకు బినామీగా వ్యవహరిస్తూ కాసులకు కక్కుర్తి పడి వేలకోట్లు దోచుకున్నవ్యక్తి కడియం శ్రీహరి అని మాజీ డిప్యూటీ

కాసులకు కక్కుర్తి పడే వ్యక్తి కడియం శ్రీహరి
X

దిశ, రఘునాథపల్లి: కాంట్రాక్టర్లకు బినామీగా వ్యవహరిస్తూ కాసులకు కక్కుర్తి పడి వేలకోట్లు దోచుకున్నవ్యక్తి కడియం శ్రీహరి అని మాజీ డిప్యూటీ సీఎం డాక్టర్ రాజయ్య అన్నారు. సోమవారం మండలంలో వివిధ గ్రామాల్లో రైతు కోసం ఊరూరుకు బీఆర్ఎస్ పార్టీ ప్రచార కార్యక్రమం నిర్వహించారు. అనంతరం గబ్బెట గ్రామంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఎన్నికలు ఎప్పుడు వచ్చినా, ఘన్పూర్ నియోజకవర్గ ప్రజలు కడియం శ్రీహరిని ఓడించి, పర్వతగిరికి పంపించడం ఖాయమని తెలిపారు.

కల్వకుంట్ల కుటుంబాన్ని విమర్శించే నైతిక హక్కు కడియంకు లేదని, వెన్నుపోటు పొడవడంలో చంద్రబాబును మించిన నాయకుడని అన్నారు. కాంగ్రెస్ పార్టీకి 200 కోట్లకు అమ్ముడుపోయిన చరిత్ర కడియం శ్రీహరిది అని ఆరోప‌ణ‌లు చేశారు. కేసీఆర్‌, కేటీఆర్, హరీష్ రావు లను విమర్శిస్తే కడియంకు పుట్ట గతులు ఉండవన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ చేసిన ఘనపూర్ ఇన్చార్జ్ ఎర్రోళ్ల కుమార్ గౌడ్ జిల్లా నాయకులు గూడ కిరణ్ కుమార్ కావటి రాజయ్య మడ్లపల్లి సునీత దేవర ఆగయా కూర రాజేందర్ మర్లపల్లి సునీత దుబ్బాక హరీష్ ముప్పిడి సాంబ రంజాన్ పాల్గొన్నారు

Next Story