ఎంపీటీసీ, జెడ్పిటిసి ఎన్నికల్లో గెలుపు మాదే

by velandi.Saikiran |

ఎంపిటిసి ,జెడ్పిటిసి ఎన్నికలలో బిఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించుకుంటామ‌ని ఆ పార్టీ మండల కోఆర్డినేటర్ ఎండి ఫిరోజ్ అన్నారు

ఎంపీటీసీ, జెడ్పిటిసి ఎన్నికల్లో గెలుపు మాదే
X

దిశ, బచ్చన్నపేట : మండలంలో జరగనున్న ఎంపిటిసి ,జెడ్పిటిసి ఎన్నికలలో బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించుకుంటామ‌ని ఆ పార్టీ మండల కోఆర్డినేటర్ ఎండి ఫిరోజ్ అన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గ్రామస్థాయిలో బిఆర్ఎస్ పార్టీ క్యాడర్ పటిష్టంగా ఉందని, నాయకులను ,కార్యకర్తలను కలుపుకొని, ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి ఆదేశాలకు పాటిస్తూ పార్టీ బలోపేతానికి కృషి చేస్తామని అన్నారు. ఎన్నికలు ఏదైనా గెలుపు మాత్రం బిఆర్ఎస్ పార్టీదే అని ధీమా వ్యక్తం చేశారు.

గతంలో అన్ని వర్గాల ప్రజలకు సమన్యాయం చేసే విధంగా సంక్షేమ పథకాలకు రూపకల్పన చేశారన్నారు. గడప గడపకూ శుద్ధి చేసిన నీటిని అందించే మిషన్‌ భగీరథ పథకం దేశానికే ఆదర్శంగా నిలిచిందన్నారు. ఒక వైపు రాష్ట్ర అభివృద్ధి, మరోవైపు ప్రజల సంక్షేమానికి కట్టుబడి పని చేసే ముఖ్యమంత్రి కెసిఆర్ అని కొని ఆడారు. దేశంలో ఏ రాష్ట్రంలో ఇవ్వని రైతులకు రైతు భరోసా అందించి రైతులందరికీ పెద్దన్నగా నిలిచారని పేర్కొన్నారు.

జనగామ నియోజకవర్గ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి నియోజకవర్గ ప్రజలందరికీ తమ నీలిమ హాస్పిటల్ ద్వారా ఉచిత వైద్యం అందించన ఆరోగ్య దాతగా పేర్కొన్నారు.కరోనా సంక్షోభంలో కూడా ఏ ఒక్క సంక్షేమ పథకం కూడా ఆగకుండా కొనసాగాయన్నారు. ఈ కార్యక్రమంలో జూకంటి కిష్టయ్య, కాసాని మహేందర్ రెడ్డి, గద్ద శ్రీను, గూడ సిద్ధారెడ్డి,బాలచందర్,మల్లేశం,జగన్ రెడ్డి, జైపాల్ రెడ్డి, జూకంటికృష్ణ తదితరులు పాల్గొన్నారు.

Next Story