Breaking: కోర్టులో బండి సంజయ్.. బయట లాఠీఛార్జి

by Disha Web Desk 16 |
Breaking: కోర్టులో బండి సంజయ్.. బయట లాఠీఛార్జి
X

దిశ, వెబ్ డెస్క్: బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ను తీసుకెళ్తున్న పోలీస్ వాహనంపై బీఆర్ఎస్ శ్రేణులు చెప్పులు, కోడిగుడ్లు విసిరారు. పేపర్ లీక్ కేసులో బండి సంజయ్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. దీంతో ఆయనను కొద్దిసేపటి కిందట హన్మకొండ ప్రిన్సిపల్ మేజిస్ట్రేట్ అనిత రాపోల్ ఎదుట హాజరుపర్చారు. ఈ నేపథ్యంలో కోర్టు పరిసరాలతో పాటు బండి సంజయ్‌ను తీసుకెళ్తున్న రోడ్డులో ఉద్రిక్తత చోటు చేసుకుంది. దీంతో బండి సంజయ్‌ను పోలీసులు వెనుక గేటు నుంచి కోర్టులోకి తీసుకెళ్లారు. ప్రస్తుతం కోర్టులో విచారణ కొనసాగుతోంది.

అయితే బండి సంజయ్‌ను కోర్టుకు తీసుకెళ్లే క్రమంలో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. బండిసంజయ్‌ను తీసుకెళ్తుండగా పోలీసు వాహనాన్ని బీఆర్ఎస్ శ్రేణులు అడుగడుగునా అడ్డుపడ్డారు. బండి సంజయ్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ పోలీస్ వాహనంపై దాడి చేసేందుకు యత్నించారు. అటు కోర్టు ప్రాంగణంలోనూ పోలీస్ వాహనాన్ని అడ్డుకునేందుకు యత్నించారు. దీంతో బీఆర్ఎస్ శ్రేణులపై పోలీసులు లాఠీఛార్జి చేసి చెదరగొట్టారు. అనంతరం బండి సంజయ్‌ను కోర్టులో ప్రవేశపెట్టారు. మరోవైపు కోర్టు బయట బీజేపీ కార్యకర్తలు కూడా భారీగా చేరుకున్నారు. దీంతో పోలీసులు భారీగా మోహరించారు. పటిష్ట భద్రత ఏర్పాటు చేశారు.

Read more:

బండి సంజయ్‌ని పోలీసులు కొట్టారా..?...చొక్కా విప్పి లాయర్లకు గాయాలు చూపించిన ఎంపీ!?


Next Story

Most Viewed