తమ్ముడని చేరదీస్తే కోటికి శఠగోపం..! ఈ కథేంటీ..?

by Bhanu |

సొంత తమ్ముడు అని నమ్మినందుకు కోటి 30 లక్షలు గోల్‌మాల్‌ చేసిన ఘటన వరంగల్‌ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్‌ పరిధిలో చోటుచేసుకుంది.

తమ్ముడని చేరదీస్తే కోటికి శఠగోపం..! ఈ కథేంటీ..?
X

దిశ, వరంగల్‌ టౌన్ : సొంత తమ్ముడు అని నమ్మినందుకు కోటి 30 లక్షలు గోల్‌మాల్‌ చేసిన ఘటన వరంగల్‌ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్‌ పరిధిలో చోటుచేసుకుంది. వరంగల్‌ ఏనుమాముల వ్యవసాయ మార్కెట్లోని కేశవ ట్రేడర్స్‌ యజమాని సాంబయ్య తన సోదరుడు సంపత్‌ ఖాళీగా ఉంటున్నాడని తన వ్యాపారంలో భాగస్వామిగా చేర్చుకున్నాడు. సాంబయ్య మార్కెట్‌ యార్డ్‌లో మిర్చి కొనుగోలు చేస్తూ నగదు విషయమై తన సోదరుడికి అప్పగించారు.

ఇదే అదనుగా భావించిన సోదరుడు సంపత్‌ కోటి 30 లక్షల రూపాయలు సొంత ఖాతాలోకి బదిలీ చేసుకొని అడ్తీ దుకాణానికి రావడం మానేశాడు. దీంతో సాంబయ్య పలుమార్లు చాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ పెద్దల వద్దకు పిలిస్తే తనకు సంబంధం లేదని తాను 30 లక్షల రూపాయలు మాత్రమే వాడుకున్నానని నోట్‌ రాసిచ్చాడు. సాంబయ్య మాత్రం కోటి 30 లక్షల రూపాయలు తేడా వచ్చిందని లెక్కలు పూర్తిగా తన దగ్గర ఉన్నాయని కొంతమంది ఛాంబర్‌ ప్రతినిధులు తన సోదరుడికి మద్దతు తెలుపుతున్నారని ఇప్పటికైనా తన యందు దయవుంచి ఛాంబర్‌ అధ్యక్షులు తనకు న్యాయం చేయాలని సాంబయ్య వేడుకుంటున్నాడు.

Next Story