Medaram Jatara 2026: అమ్మవార్లను దర్శించుకున్న బ్రిటిష్ డిప్యూటీ హై కమిషనర్

by Ajay Maddhiboyina |   (  Updated:2026-01-30 07:17:25  IST  )

మంత్రి సీతక్క స‌మ్మ‌క్క సార‌క్క అమ్మవార్ల‌కు మొక్కులు చెల్లించుకున్నారు. ఈ రాష్ట్ర ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని ప్రార్థించారు.

Medaram Jatara 2026: అమ్మవార్లను దర్శించుకున్న బ్రిటిష్ డిప్యూటీ హై కమిషనర్
X

దిశ మేడారం న్యూస్ నెట్ వర్క్: మంత్రి సీతక్క స‌మ్మ‌క్క సార‌క్క అమ్మవార్ల‌కు మొక్కులు చెల్లించుకున్నారు. ఈ రాష్ట్ర ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని ప్రార్థించారు. అనంతరం జాతరకు వచ్చిన భక్తులతో కలసి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా సీతక్క మాట్లాడుతూ.. మేడారం జాతర రాష్ట్ర సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక అని పేర్కొన్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేపట్టిందని తెలిపారు. మ‌రోవైపు హైద‌రాబాద్ బ్రిటిష్ డిప్యూటీ హై కమిషనర్ గ్యారత్ వెన్ ఒవేన్ సైతం అమ్మ‌వారిని దర్శించుకున్నారు. సీత‌క్క ద‌గ్గ‌రుండి ఆయ‌న‌ను ద‌ర్శ‌నానికి తీసుకువెళ్లారు. వారి వెంట‌ పొలిటికల్ ఏకానమిక్ అడ్వయిజ‌రీ న‌ళిని రఘురామన్ ఉన్నారు. మంత్రి సీతక్క జాతర విశేషాలు వారికి వివరించారు.

Next Story