పెళ్లి సంబరాల్లో విషాదం...వడదెబ్బతో వధువు తండ్రి మృతి

by Bhanu |

మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలంలోని గంధంపల్లి- కొత్తపేట పంచాయతీ పరిధిలో ఇంట్లో శుభకార్యము పెండ్లి ఉండగా పనుల నిమిత్తం బిజీ బిజీ గా గడపడంతో వడదెబ్బ తగిలి, మంగళవారం జంగిలి సతీష్ (45) మృతి చెందాడు.

పెళ్లి సంబరాల్లో విషాదం...వడదెబ్బతో వధువు తండ్రి మృతి
X

దిశ, బయ్యారం : మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలంలోని గంధంపల్లి- కొత్తపేట పంచాయతీ పరిధిలో ఇంట్లో శుభకార్యము పెండ్లి ఉండగా పనుల నిమిత్తం బిజీ బిజీ గా గడపడంతో వడదెబ్బ తగిలి, మంగళవారం జంగిలి సతీష్ (45) మృతి చెందాడు. స్థానికులు , గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం... మృతుడు చిన్న కూతురు వివాహ వేడుక ఈనెల 18 న వివాహ వేడుకలను జరిపారు. తర్వాత రోజు నుండి అనారోగ్యానికి గురి కావడంతో ఈనెల 19న, మహుబూబాబాద్ లో ప్రైవేటు ఆసుపత్రికి బంధువులు తరలించి వైద్యం అందిస్తుండగా వడదెబ్బతో మృత్యువాత పడినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. దీనితో పెండ్లి ఇంటి కుటుంబంలో విషాదఛాయలు నెలకొన్నాయి. వివాహ వేడుక సంబరాలు ఆ ఇరువురి కుటుంబంలో శోకాన్ని మిగిల్చాయని తెలిపారు.

Next Story