- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ట్రాక్టర్ రోటివేటర్ కింద పడి 7ఏళ్ల బాలుడు మృతి..
by Bhanu |
మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు మండలం రాజులకొత్తపల్లి గ్రామంలో జరిగిన దుర్ఘటన ఒక చిన్నారి ప్రాణాన్ని తీసింది.

X
దిశ, మహబూబాబాద్ టౌన్ : మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు మండలం రాజులకొత్తపల్లి గ్రామంలో జరిగిన దుర్ఘటన ఒక చిన్నారి ప్రాణాన్ని తీసింది. ట్రాక్టర్ రోటివేటర్ కిందపడి ఏడేళ్ల బాలుడు మృతి చెందాడు.ఇన్ఛార్జి ఎస్సై శివరామకృష్ణ తెలిపిన వివరాల ప్రకారం.. రాజులకొత్తపల్లి గ్రామానికి చెందిన జిలుకర ప్రసాద్, స్వర్ణ దంపతులకు ముగ్గురు సంతానం, కూతురు సౌమ్య, కుమారులు సందీప్, వరుణ్ (7) ఉన్నారు. ప్రసాద్ ఆదివారం పొలం దున్నేందుకు వెళ్లిన సమయంలో తన ముగ్గురు పిల్లలను ట్రాక్టర్‌పై కూర్చోబెట్టాడు. ఈ క్రమంలో వరుణ్ ప్రమాదవశాత్తూ ట్రాక్టర్‌పై నుంచి జారి పడి రోటివేటర్ కింద చిక్కుకొని తీవ్ర గాయాలవేసుకొని అక్కడికక్కడే మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటన గ్రామంలో విషాదాన్ని నెలకొల్పింది.
Next Story






