గంజాయి కేసులో ఇద్ద‌రికీ 20 ఏళ్ల జైలు శిక్ష

by Nallavelli.Anjaneyulu |

గంజాయి కేసులో ఇద్ద‌రికీ 20 సంవ‌త్స‌రాల జైలు శిక్ష‌తో పాటు ఒక్కొక్క‌రికీ రూ.ల‌క్ష జ‌రిమానా కోర్టు విధించింద‌ని సీఐ పులి ర‌మేష్ తెలిపారు.

గంజాయి కేసులో ఇద్ద‌రికీ 20 ఏళ్ల జైలు శిక్ష
X

దిశ‌, ఎల్క‌తుర్తి : గంజాయి కేసులో ఇద్ద‌రికీ 20 సంవ‌త్స‌రాల జైలు శిక్ష‌తో పాటు ఒక్కొక్క‌రికీ రూ.ల‌క్ష జ‌రిమానా కోర్టు విధించింద‌ని సీఐ పులి ర‌మేష్ తెలిపారు. గురువారం సీఐ విలేక‌ర్ల స‌మావేశంలో వివ‌రాల‌ను వెల్ల‌డించారు. గ‌తంలో ఎల్క‌తుర్తి ఎస్సై గా గోదావ‌రి రాజ‌కుమార్ ప్ర‌స్తుతం సీసీఐ ఎస్సైగా ప‌ని చేస్తున్నాడు. అయితే ఆయ‌న ఆధ్వ‌ర్యంలో మ‌ధ్య ప్ర‌దేశ్ కి చెందిన రాజావ‌ర్మ‌, మ‌హారాష్ట్ర‌కు చెందిన సాహెబ్ రావు ప‌టేల్ విశాఖ‌ప‌ట్నం నుంచి మ‌హారాష్ట్ర‌కు సుమారు 300 కిలోల గంజాయి త‌ర‌లిస్తుండ‌గా.. ఎల్క‌తుర్తి స‌మీపంలో ఎస్సై గోదావ‌రి రాజ్ కుమార్ ప‌ట్టుకొని కేసు న‌మోదు చేసి జైలుకు పంపించాడు. ఆ కేసును సీఐ పులి రమేష్ ఆధ్వ‌ర్యంలో ఎల్క‌తుర్తి ఎస్సై అక్కినేప‌ల్లి ప్ర‌వీణ్ కుమార్ బ‌ల‌మైన సాక్ష్యాధారాల‌ను ప్ర‌వేశ‌పెట్టి కోర్టులో హాజ‌రు ప‌రిచారు. ప‌బ్లిక్ ప్రాసిక్యూట‌ర్ రాజా మ‌ల్లారెడ్డి కేసును వాదించి నిరూపించారు. జ‌డ్జీ అప‌ర్ణాదేవి నిందితుల‌కు 20 ఏళ్ల జైలు శిక్ష‌తో పాటు ఒక్కొక‌క‌రికీ రూ.1ల‌క్ష జ‌రిమానా విధించిన‌ట్టు తీర్పు వెల్ల‌డించారు. క‌ష్ట‌ప‌డి నిందితుల‌కు శిక్ష ప‌డేలా చేసినందుకు సీఐ పులి ప‌ర‌మేష్, ఎస్సై ప్ర‌వీణ్ కుమార్, అప్ప‌టి ఎస్సై గోదావ‌రి రాజ కుమార్, ఏఎస్ఐ ప‌ర‌మేశ్వ‌రి, హెడ్ కానిస్టేబుల్ కుమార‌స్వామి, ఉమెన్ పీసీ అనూష‌ల‌కు సెంట్ర‌ల్ జోన్ డీసీపీ, ధారా క‌విత‌, కాజీపేట ఏసీపీ పింగ‌ళి ప్ర‌శాంత్ రెడ్డి అభినందించారు.

Next Story