పట్టణ బంద్ కు బీజేపీ పిలుపు

by Ratna Kumari |

నర్సంపేట పట్టణంలో ఆర్టీసీ కార్మికుల సమ్మె నేపథ్యంలో ఆర్టీసీ డ్రైవర్ శంకర్ ఆత్మహత్యాయత్నం చేసిన సంగతి తెలిసిందే.

పట్టణ బంద్ కు బీజేపీ పిలుపు
X

దిశ, నర్సంపేట : నర్సంపేట పట్టణంలో ఆర్టీసీ కార్మికుల సమ్మె నేపథ్యంలో ఆర్టీసీ డ్రైవర్ శంకర్ ఆత్మహత్యాయత్నం చేసిన సంగతి తెలిసిందే. ఆర్టీసీ డిపో డ్రైవర్ కోలా శంకర్ ని ఎంజిఎం హాస్పిటల్ లో బీజేపీ వరంగల్ జిల్లా అధ్యక్షులు గంటా రవి కుమార్, బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి డా. గోగుల రాణా ప్రతాప్ రెడ్డి పరామర్శించారు. అనంతరం మీడియా తో మాట్లాడారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు రెండు దీనికి కారణమన్నారు. 2014 నుంచి బీఆర్ఎస్ మోసం చేస్తూ వచ్చిందని, రెండున్నర ఏళ్లుగా కాంగ్రెస్ సైతం అలానే ఆర్టీసీ కార్మికుల పొట్ట కొట్టిందన్నారు. ఈ క్రమంలో ఆర్టీసీ కార్మికులకు పూర్తి మద్దతుగా భారతీయ జనతా పార్టీ శుక్రవారం నర్సంపేట పట్టణ బంద్ కు పిలుపునిస్తున్నట్లు బీజేపీ వరంగల్ జిల్లా ప్రధాన కార్యదర్శి గోగుల రాణా ప్రతాప్ రెడ్డి తెలిపారు. నర్సంపేట పట్టణ వర్తక వ్యాపార వేత్తలు ఈ బంద్ కు మద్దతు తెలపాలని కోరారు.

Next Story