Breaking News... బైక్‌తో సహా బావిలో పడ్డ సర్పంచ్

by Disha Web |
Breaking News... బైక్‌తో సహా బావిలో పడ్డ సర్పంచ్
X

దిశ, వేలేరు: వ్యక్తిగత పనిపై హన్మకొండ వెళ్లి వేలేరుకు తిరిగి వస్తుండగా మండలంలోని బండతండా సమీపంలో వేలేరు సర్పంచ్ కాయిత మాధవరెడ్డి బైక్ అదుపుతప్పి పక్కనే ఉన్న వ్యవసాయ బావిలో బైక్ తో సహా పడ్డారు. సర్పంచ్ మాధవరెడ్డికి ఈత రావడంతో వెంటనే బావిలో ఉన్న తాడును గట్టిగా పట్టుకుని అరవడంతో అటుగా వెళ్తున్న స్థానికులు గమనించి తాడు సహాయంతో బయటకు తీశారు. వెంటనే 108 వాహనంకు సమాచారం ఇవ్వగా సంఘటనా స్థలానికి చేరుకుని సర్పంచ్ కి ప్రథమ చికిత్స అందించి మెరుగైన చికిత్స కోసం హన్మకొండలోని ఆసుపత్రికి తరలించారు.




Next Story