చలానా కన్నా ఎక్కువ వసూళ్లు.. సబ్‌రిజిస్ట్రార్ ఆఫీసులో ఏసీబీ దాడులు..

by Bhanu |

సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో అక్రమ వసూళ్లపై వచ్చిన పక్కా సమాచారం నేపథ్యంలో భీమదేవరపల్లి మండలంలోని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు గురువారం ఆకస్మికంగా దాడులు నిర్వహించారు.

చలానా కన్నా ఎక్కువ వసూళ్లు.. సబ్‌రిజిస్ట్రార్ ఆఫీసులో ఏసీబీ దాడులు..
X

దిశ, భీమదేవరపల్లి: సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో అక్రమ వసూళ్లపై వచ్చిన పక్కా సమాచారం నేపథ్యంలో భీమదేవరపల్లి మండలంలోని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు గురువారం ఆకస్మికంగా దాడులు నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్యుమెంట్ రైటర్ల వద్ద నుంచి రూ.96,870 నగదు బయటపడింది.

ఈ ఘటనపై ఏసీబీ అధికారి సాంబయ్య మీడియాతో మాట్లాడుతూ— గత కొన్ని రోజులుగా ఈ కార్యాలయంలో అధికారుల భాగస్వామ్యంతో, డాక్యుమెంట్ రైటర్ల ద్వారా చలానా ఫీజు కన్నా ఎక్కువ మొత్తాన్ని వసూలు చేస్తున్నారని తమకు సమాచారం అందిందని తెలిపారు. దీనితో డీజీ విజయ్ కుమార్ ఐపీఎస్ ఆదేశాల మేరకు సర్ప్రైజ్ చెక్ నిర్వహించామని పేర్కొన్నారు.

వాస్తవానికి ప్రజలకు సులభంగా లభించాల్సిన సేవలు మధ్యవర్తుల మాయాజాలంలో చిక్కి అవాంఛిత లావాదేవీలకు గురవుతున్నాయని అన్నారు. ‘‘ఈ దాడిలో బయటపడిన మొత్తం, నమోదైన తీరుపై ప్రభుత్వానికి రిపోర్టు పంపిస్తాం. తదుపరి ఆదేశాల మేరకు చట్టపరమైన చర్యలు తీసుకుంటాం,’’ అని స్పష్టం చేశారు. ప్రజా సేవలో పారదర్శకతకు భంగం కలిగించే ఇటువంటి చర్యలు పూర్తిగా చట్ట విరుద్ధమని హెచ్చరించారు.

Next Story