జాగ్రత్త.. ఈ జిల్లా అడవుల్లో పెద్ద పులి సంచారం

by Naveena |

ములుగు జిల్లా కన్నాయిగూడెం అడవుల్లో పులి సచ్చరిస్తున్నట్టు అటవీశాఖ అధికారులు గుర్తించారు.

జాగ్రత్త.. ఈ జిల్లా అడవుల్లో పెద్ద పులి సంచారం
X

దిశ, ములుగు ప్రతినిధి: ములుగు జిల్లా కన్నాయిగూడెం అడవుల్లో పులి సచ్చరిస్తున్నట్టు అటవీశాఖ అధికారులు గుర్తించారు. తాడ్వాయి మండలం బూడిదపెంట, గొత్తికోయగూడెం సమీప అడవుల్లో ఓ ఆవుపై పెద్దపులి దాడి చేసి చంపి తిన్న ఆనవాళ్లను స్థానికులు గుర్తించి అటవీశాఖ అధికారులకు తెలిపారు. దీంతో ఘటనా స్థలానికి చేరుకుని పెద్దపులి అడుగు జాడలను గుర్తించినట్టు ఫారెస్ట్ అధికారు వెల్లడించారు. ప్రస్తుతం పులి అక్కడ నుంచి కన్నాయిగూడెం అడవుల వైపు వెళ్లిందని, సమీప గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. పశువుల మేతకు అడవిలోకి వెళ్లొద్దని, పులి ఆడవాళ్లు తెలిస్తే.. ఫారెస్ట్ అధికారులకు తెలియజేయాలని తెలిపారు.

Next Story