- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
తునికాకు సేకరణలో విషాదం.. తునికాకు కోస్తూ చెట్టు నుండి పడి ఇద్దరికి గాయాలు
తునికాకు సేకరిస్తున్న క్రమంలో ప్రమాదవశాత్తు ఇద్దరు మహిళలకు గాయాలు అయిన సంఘటన మహబూబాబాద్ జిల్లా లోని కొత్తగూడ మండలములోని లక్ష్మీపురం గ్రామ అటవీప్రాంతంలో చోటు చేసుకుంది ప్రత్యక్ష సాక్షులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.

దిశ, కొత్తగూడ : తునికాకు సేకరిస్తున్న క్రమంలో ప్రమాదవశాత్తు ఇద్దరు మహిళలకు గాయాలు అయిన సంఘటన మహబూబాబాద్ జిల్లా లోని కొత్తగూడ మండలములోని లక్ష్మీపురం గ్రామ అటవీప్రాంతంలో చోటు చేసుకుంది ప్రత్యక్ష సాక్షులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. ప్రకృతి పరమైన ఆదివాసీల వనరు అయిన తునికాకు (బీడి ఆకు) సేకరణకు మండలములోని లక్ష్మీపురం గ్రామానికి చెందిన వజ్జ ఎల్లమ్మ, కన్నమ్మ ఇద్దరు మహిళలు చెట్టు కొమ్మ విరిగి కింద పడటంతో తీవ్ర గాయాలయ్యాయి. హుటాహుటిన తోటి కూలీలు 108 కి సమాచారం అందించి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
రోజువారీ కూలీకి వెళ్తూ ఈ ప్రమాదానికి గురైన ఈ మహిళలు ఆర్థికంగా వెనుకబడినవారు కావడంతో, ప్రభుత్వం స్పందించి అన్ని విధాలా ఆదుకోవాలనితుడుం దెబ్బ మండల అధ్యక్షులు పూనెం సందీప్ కోరుతూ. వైద్యం ఖర్చులు మరియు కుటుంబ పోషణకు సహాయం అందించాలని ఇలాంటి ప్రమాదాలు తరచూ జరుగుతున్నప్పటికీ తునికాకు సేకరణ ప్రాంతాల్లో కనీస సదుపాయాలు లేకపోవడంపై ఆవేదన వ్యక్తం చేస్తు. కూలీల పట్ల చిన్నచూపు చూపుతూ, మౌలిక వసతులు కల్పించకపోవడం వల్లే ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయని వారు ఆరోపిస్తున్నారు. తునికాకు సేకరణ ప్రాంతాల్లో మంచినీరు, సహాయ సిబ్బంది, ప్రాథమిక వైద్య సౌకర్యాలు తప్పనిసరిగా అందుబాటులో ఉంచాలని డిమాండ్ చేశారు.






