పిలువని పెళ్లికి వెళ్లారో జాగ్రత్త..!

by Ratna Kumari |

సాధార‌ణంగా పెళ్లిళ్లు అంటే బంధుమిత్రుల సందడి, విందు భోజనాలతో కళకళలాడే వేడుకలు. అయితే ఆహ్వానం లేకుండానే పెళ్లి విందులకు వెళ్లే ఘటనలు పెరుగుతున్న నేపథ్యంలో మానుకోట పట్టణంలోని కొన్ని ఫంక్షన్ హాల్స్ ముందు ఏర్పాటు చేసిన హెచ్చరిక బోర్డులు ప్రస్తుతం వైరల్‌గా మారాయి.

పిలువని పెళ్లికి వెళ్లారో జాగ్రత్త..!
X

దిశ, మహబూబాబాద్ : సాధార‌ణంగా పెళ్లిళ్లు అంటే బంధుమిత్రుల సందడి, విందు భోజనాలతో కళకళలాడే వేడుకలు. అయితే ఆహ్వానం లేకుండానే పెళ్లి విందులకు వెళ్లే ఘటనలు పెరుగుతున్న నేపథ్యంలో మానుకోట పట్టణంలోని కొన్ని ఫంక్షన్ హాల్స్ ముందు ఏర్పాటు చేసిన హెచ్చరిక బోర్డులు ప్రస్తుతం వైరల్‌గా మారాయి. ఇటీవలి కాలంలో పెద్ద ఫంక్షన్ హాల్స్‌లో జరిగే పెళ్లిళ్లకు సంబంధంలేని కొందరు వ్యక్తులు వెళ్లి విందు భోజనం చేసి వెళ్లే ఘటనలు పెరుగుతున్నాయని నిర్వాహకులు చెబుతున్నారు. ఈ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ముందస్తు జాగ్రత్తగా ఈ బోర్డులు ఏర్పాటు చేసినట్లు వారు చెబుతున్నారు. ఫంక్షన్ హాల్ ప్రవేశ ద్వారాల వద్ద ఏర్పాటు చేసిన బోర్డుల్లో “సంబంధం లేని వ్యక్తులు దొరికినచో సెక్షన్ 441 ప్రకారం.. మూడు నెలల జైలు శిక్ష లేదా రూ.5,000 వరకు జరిమానా విధించబడును” అని హెచ్చరికగా పేర్కొన్నారు.దీంతో ఆహ్వానం లేకుండా పెళ్లి వేడుకలకు వచ్చే వారిని అరికట్టడమే లక్ష్యంగా ఈ చర్య తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ బోర్డుల ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో కూడా వైరల్ అవుతూ పట్టణంలో చర్చనీయాంశంగా మారాయి. పెళ్లి వేడుకలకు ఆహ్వానం ఉన్నవారే హాజరుకావాలని నిర్వాహకులు సూచిస్తున్నారు.

Next Story