బయ్యారంలో మట్టి దొంగల రాజ్యం.. అధికారుల మౌనం ఏ సంకేతం?

by Bhanu |

మండలంలో గత ఐదు ఆరు రోజుల నుండి సోలం వారికుంట ఇతర కుంటలలో చెరువులలో మట్టిని అక్రమంగా తరలిస్తూ వేల క్యూబిక్ మీటర్లను గృహ వినియోగదారులకు ఇతర అవసరాలకు వినియోగిస్తున్న అక్రమార్కులపై అధికారులు చర్యలు తీసుకోవడం లేదని పలువురు విమర్శిస్తున్నారు.

బయ్యారంలో మట్టి దొంగల రాజ్యం.. అధికారుల మౌనం ఏ సంకేతం?
X

దిశ, బయ్యారం : మండలంలో గత ఐదు ఆరు రోజుల నుండి సోలం వారికుంట ఇతర కుంటలలో చెరువులలో మట్టిని అక్రమంగా తరలిస్తూ వేల క్యూబిక్ మీటర్లను గృహ వినియోగదారులకు ఇతర అవసరాలకు వినియోగిస్తున్న అక్రమార్కులపై అధికారులు చర్యలు తీసుకోవడం లేదని పలువురు విమర్శిస్తున్నారు. వీరిపై అధికారులు చర్యలు తీసుకోరా.. లేక వీరి కనసన్నలోనే ఈ తతంగం అంతా జరిగిందా... అనే సందేహాలు నివృత్తి జరుగుతున్నాయి. గత అనేక నెలలుగా మట్టి దందా జరుగుతున్నా, వేల క్యూబిక్ మీటర్ల మట్టిని తరలిస్తూ,లక్షలు ఖండిస్తూ ఉన్నా, ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండి కొడుతున్న ఘణులు అధికారుల వద్ద వారి పైరవీలు మొదలుపెట్టినట్లు మండలంలో చర్చనీయాంశంగా మారింది.


ఇప్పటికైనా అధికారులు స్పందించి మట్టి అక్రమ రవాణా దారులపై ,మట్టి దొంగలపై చర్యలు తీసుకొని ప్రభుత్వ పరిపాలన ప్రజా పరిపాలన పారదర్శకత జరుగుతున్నట్లు ప్రజలకు తెలియజేయాల్సిన అవసరం పలువురు కోరుతున్నారు. దీనిపై మైనింగ్ శాఖ మండల తహశీల్దార్ బి.విజయ కు, బిజెపి పార్టీలు ఇతరులు ఫిర్యాదులు చేసినా.. నేటికీ అధికారులు పట్టించుకోకపోవడంలో ఆంతర్యం ఏమిటని పలువురు పలు రకాలుగా చర్చించుకుంటున్నారు. ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ సంబంధిత మైనింగ్, రెవెన్యూ, ఇరిగేషన్ శాఖఅధికారులు స్పందించి మట్టి అక్రమ రవాణా ఎంత మేరకు జరిగిందో పరిశీలన చేసి తగు చర్యలు తీసుకోవాలని మండల ప్రజలు రాజకీయ నాయకులు కోరుతున్నారు.

Next Story