- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
జర్ర చూడండయ్యా.. అది జాతీయ జెండా..!
మండల కేంద్రంలోని రామాలయం సమీపంలో ఇల్లందు- మహబూబాబాద్ ప్రధాన రహదారి పక్కనే, ఇందిరా గాంధీ విగ్రహం వద్ద అధికార పార్టీ నాయకులు జూన్ 2 తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా జాతీయ జెండాను సోమవారం ఎగురవేశారు.

దిశ, బయ్యారం : మండల కేంద్రంలోని రామాలయం సమీపంలో ఇల్లందు- మహబూబాబాద్ ప్రధాన రహదారి పక్కనే, ఇందిరా గాంధీ విగ్రహం వద్ద అధికార పార్టీ నాయకులు జూన్ 2 తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా జాతీయ జెండాను సోమవారం ఎగురవేశారు. అయితే.. జెండాను సాయంత్రం అవనతం చేయడం మాత్ర మర్చిపోయారు. మంగళవారం వరకు ఎత్తిన జాతీయ జెండాను రెండు రోజులైన అవనతం చేయకుండా నిర్లక్ష్యం చేశారు. మంగళవారం కూడా నాయకులు అటువైపు చూడకుపోవడం కొసమెరుపు.
అటుగా వెళుతున్న జనం, అధికార పార్టీ కాంగ్రెస్ నాయకుల పట్ల అసహనం వ్యక్తం చేస్తూ చర్చించుకుంటున్నారు. ఆవిర్భావ దినోత్సవం రోజు మండల కాంగ్రెస్ నాయకులు ఎగురవేసిన జెండా ఎందుకు అవనతం చేయలేకపోయారని అంత మాత్రం దానికి జాతీయ జెండాను ఆవిష్కరణ చేయడం ఎందుకని జనాలు మాట్లాడుకుంటున్నారు. ఇప్పటికైనా నాయకులు జాతీయ జెండాను గౌరవించి అవనతం చేయాలని పలువురు కోరుతున్నారు.






