- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పాగింగ్ మిషన్ ఆరంభంలో మొరాయింపు
నూతన పాలకవర్గం ఏర్పడక ముందు మున్సిపాలిటీ అవసరాలకు అనుగుణంగా కొనుగోలు జరిపిన వాహనాలు, మిషన్ల పని తీరుపై స్థానికుల్లో పలు సందేహాలు వ్యక్తమవుతున్నాయి. గ

దిశ, డోర్నకల్: నూతన పాలకవర్గం ఏర్పడక ముందు మున్సిపాలిటీ అవసరాలకు అనుగుణంగా కొనుగోలు జరిపిన వాహనాలు, మిషన్ల పని తీరుపై స్థానికుల్లో పలు సందేహాలు వ్యక్తమవుతున్నాయి. గత ఏడాది చివరి రోజుల్లో ప్రజా ప్రతినిధులు అట్టహాసంగా ప్రారంభించిన రెండు స్వచ్ఛ ఆటోలు 30 రోజుల్లో మూలన పడ్డ విషయం తెలిసిందే. సుమారు 16 లక్షలు వెచ్చించి కొనుగోలు చేసిన కొత్త చెత్త ఆటోలు నిరుపయోగంగా చెత్తలో చేరడంతో ఇళ్లలో చెత్త పేరుకుపోయి దుర్గంధం వెదజల్లింది. దీంతో ద్విచక్ర వాహనాలపై చెత్తను డంపింగ్ యార్డ్ కు తరలించుకున్నారు. పలు పత్రికల్లో, సోషల్ మీడియా వేదికల్లో చెత్త సేకరణ జరగడం లేదని వైరల్ కావడంతో ఎట్టకేలకు ఒక స్వచ్ఛ ఆటో అందుబాటులోకి వచ్చినట్లు తెలుస్తోంది.
ఇటీవల రూ.70 వేలతో దోమల నివారణకు కొనుగోలు చేసిన పాగింగ్ మిషన్ సోమవారం చైర్ పర్సన్ చేతుల మీదుగా ప్రారంభించిన పది నిమిషాలకే మరమ్మతులకు గురైనట్లు మాట్లాడుకుంటున్నారు. కొనుగోలు జరిపిన రోజుల వ్యవధిలోనే సేవలకు దూరమవుతుండడం స్థానికుల్లో పలు అనుమానాలు రేకెత్తుతున్నాయి. ఈ విషయమై సంబంధిత అధికారి వివరణ కోరగా.. చెత్త సేకరణకు కొనుగోలు చేసిన స్వచ్ఛ ఆటోలు వివిధ కారణాలతో నిలిచాయి. ప్రస్తుతం చెత్త వాహనాలు ప్రజలకు సేవలందిస్తున్నాయి. మున్సిపాలిటీకి గతంలో మూడు పాగింగ్ మిషన్లు కొనుగోలు జరపగా ఒకటి మాత్రమే వర్కింగ్ లో ఉంది.కొత్తది సోమవారం పాలకవర్గం ప్రారంభించారు. లేటెస్ట్ టెక్నాలజీ పాగింగ్ మిషన్ కావడంతో ఆపరేటింగ్ సక్రమంగా జరగక నిలిచింది. మళ్లీ నేడు అందుబాటులో ఉంటుంది.






