- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
గడ్డి మందు పారాక్వాట్ అమ్మకాలపై నిషేధం : జిల్లా వ్యవసాయ శాఖ అధికారి అనురాధ
రాష్ట్ర ప్రభుత్వం పారాక్వాట్ గడ్డి మందు అమ్మకాలపై 60 రోజుల పాటు నిషేధం విధించింది. ఇదే విషయం పై కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతూ అసెంబ్లీలో తీర్మానం చేసింది.

దిశ, వరంగల్ బ్యూరో : రాష్ట్ర ప్రభుత్వం పారాక్వాట్ గడ్డి మందు అమ్మకాలపై 60 రోజుల పాటు నిషేధం విధించింది. ఇదే విషయం పై కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతూ అసెంబ్లీలో తీర్మానం చేసింది. నిబంధనలు ఉల్లఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని వరంగల్ జిల్లా వ్యవసాయ శాఖ అధికారి అనురాధ తెలిపారు. పారాక్వాట్ అనే గడ్డిమందు అత్యంత విష పూరితమైనది అని.. ఇది ఆత్మహత్యలకు ప్రధాన సాధనంగా మారింది. ఈ మందును చిన్నపాటి మనస్పార్థాలు లేదా క్షణికావేశంలో సేవించిన వారు ప్రాణాలు కోల్పోతున్నారని ఆమె అన్నారు. పారాక్వాట్ గడ్డిమందు నిషేధం విషయంలో ఇప్పటికే కేరళ, ఒడిశా రాష్ట్రాలు చర్యలు తీసుకున్నాయి. ఇండియన్ మెడికల్ అసోసియేషన్ కూడా ఈ మందును నిషేధించాలని డిమాండ్ చేసిందని ఆమె తెలిపారు. జిల్లాలోని పురుగుమందు డీలర్లు ఈ గడ్డి మందులు అమ్మకూడదని అమ్మినచో కఠిన చర్యలు తీసుకోబడిన తెలియజేశారు. రైతులు గడ్డిమందులు కొనకూడదని, వాడకూడదని తెలిపారు.






