- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బచ్చన్నపేట ఆసుపత్రిని 50 పడకలుగా మార్చాలి: సీపీఎం డిమాండ్
బచ్చన్నపేట మండల కేంద్రంలోని 30 పడకల ప్రభుత్వ ఆసుపత్రిని 50 పడకల ప్రభుత్వ ఆసుపత్రిగా అప్‌గ్రేడ్ చేయాలని సిపిఎం బచ్చన్నపేట మండల కమిటీ డిమాండ్ చేసింది.

దిశ, బచ్చన్నపేట: బచ్చన్నపేట మండల కేంద్రంలోని 30 పడకల ప్రభుత్వ ఆసుపత్రిని 50 పడకల ప్రభుత్వ ఆసుపత్రిగా అప్‌గ్రేడ్ చేయాలని, తక్షణమే నూతన భవనాలు నిర్మించి ఆధునికరించాలని సిపిఎం బచ్చన్నపేట మండల కమిటీ డిమాండ్ చేసింది. సిపిఎం పార్టీ మండల కమిటీ ఆధ్వర్యంలో నాయకులు స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించి, రోగులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిశీలించారు. ఈ సందర్భంగా సిపిఎం మండల కార్యదర్శి బెల్లంకొండ వెంకటేష్ మాట్లాడుతూ.. గత 40 సంవత్సరాలుగా ఈ ఆసుపత్రి మండల ప్రజలకు ఎనలేని సేవలు అందిస్తోందన్నారు. మూడు సంవత్సరాల క్రితం ఈ ఆసుపత్రిని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నుండి సామాజిక ఆరోగ్య కేంద్రం గా మార్చినప్పటికీ, మౌలిక వసతులు మాత్రం మెరుగుపడలేదని విమర్శించారు.
లేనిపక్షంలో ప్రజల పక్షాన ఉద్యమిస్తాం..
40 ఏళ్ల క్రితం నిర్మించిన ఈ పురాతన భవనాలు పూర్తిగా పాడైపోయి, స్లాబులు నెర్రెలు బారి భారీ పగుళ్లు ఏర్పడ్డాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుత వర్షాలకు భవనాలు పూర్తిగా కురుస్తున్నాయని, కరెంటు షార్ట్ సర్క్యూట్ భయంతో అటు డాక్టర్లు, ఇటు రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. ప్రభుత్వం స్పందించి ఈ 30 పడకాల ఆసుపత్రిని 50 పడకల ఆసుపత్రిగా మారుస్తూ నూతన భవనాలు నిర్మించాలని, ప్రజలకు మెరుగైన వైద్య సదుపాయాలు కల్పించాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో ప్రజల పక్షాన ఉద్యమిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ మండల కమిటీ సభ్యులు రావుల రవీందర్ రెడ్డి, మిన్నలాపురం ఎల్లయ్య, బైరగోని బలరాములు, ఉప్పల గాలయ్య, దండగుల మురళీకృష్ణ, రామగుల్ల అశోక్, మేక రాకేష్ తదితరులు పాల్గొన్నారు.






