- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
భూపాల్ పల్లి సబ్ ట్రెజరర్ గా అజహర్ షరీఫ్
by Ratna Kumari |
భూపాలపల్లి ట్రెజరీ కార్యాలయంలో ఉప-కోషాధికారిగా విధులు నిర్వహిస్తున్న అజహర్ షరీఫ్‌కు సహాయ కోశాధికారిగా పూర్తి అదనపు బాధ్యతలు అప్పగిస్తూ తెలంగాణ రాష్ట్ర ట్రెజరీస్ అండ్ అకౌంట్స్ డైరెక్టర్, హైదరాబాద్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు.

X
దిశ, భూపాలపల్లి ప్రతినిధి : భూపాలపల్లి ట్రెజరీ కార్యాలయంలో ఉప-కోషాధికారిగా విధులు నిర్వహిస్తున్న అజహర్ షరీఫ్‌కు సహాయ కోశాధికారిగా పూర్తి అదనపు బాధ్యతలు అప్పగిస్తూ తెలంగాణ రాష్ట్ర ట్రెజరీస్ అండ్ అకౌంట్స్ డైరెక్టర్, హైదరాబాద్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మేరకు జారీ చేసిన ఆదేశాల ప్రకారం, అజహర్ షరీఫ్ తన ప్రస్తుత విధులతో పాటు సహాయ కోశాధికారిగా అదనపు బాధ్యతలను కూడా నిర్వర్తించనున్నారు. శాఖ కార్యకలాపాలు మరింత సమర్థవంతంగా కొనసాగేందుకు ఈ నియామకం దోహదపడుతుందని డిటిఓ జ్యోతిరావు తెలిపారు. అజహర్ షరీఫ్ గతంలో కూడా తన విధులను సమర్థంగా నిర్వహించిన అనుభవం ఉండటంతో, కొత్త బాధ్యతలను సక్రమంగా నిర్వర్తిస్తారని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. సహాయ కోశాధికారి పదవీ బాధ్యతలు చేపట్టిన అజహర్ షరీఫ్ ను సిబ్బంది అభినందించారు.
Next Story






