- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అట్లాంటా నగరంలో చేతన్ ఫౌండేషన్ వ్యవస్థాపకుడికి అవార్డు
అమెరికాలోని అట్లాంటా నగరంలో జరుగుతున్న ప్రతిష్టాత్మకమైన

దిశ,బయ్యారం : అమెరికాలోని అట్లాంటా నగరంలో జరుగుతున్న ప్రతిష్టాత్మకమైన 18వ ఆటా ( అమెరికా తెలుగు అసోసియేషన్ )మహాసభల సందర్భంగా చేతన గ్లోబల్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు (ప్రెసిడెంట్) వెనిగళ్ళ రవికుమార్ కు ఆట అవార్డును ఆట ప్రెసిడెంట్ మధు బొమ్మినేని చేతుల మీదుగా అందుకున్నారు. చేతన గ్లోబల్ ఫౌండేషన్ ద్వారా అమెరికా, భారతదేశం తో పాటు ఏడు దేశాల్లో స్వచ్ఛంద కార్యక్రమాలు,నిర్వహిస్తున్నారు. విద్య, వైద్యం, మహిళా సాధికారిక, పర్యావరణ, వివిధ కార్యక్రమాలు గుర్తించి ఈ ప్రతిష్టాత్మక అవార్డును అందించారు. ఈ సందర్భంగా వెనిగళ్ళ రవికుమార్ మాట్లాడుతూ ఈ అవార్డును చేతన ఫౌండేషన్ లో అంకితభావంతో పని చేస్తున్న ప్రతి వాలంటీర్లకు అంకితం చేస్తున్నట్లు తెలిపారు.
పుట్టిన గడ్డని మరువక పలువురికి చేయూత : అవార్డు గ్రహిత వెనిగళ్ల రవికుమార్
బయ్యారం మండలానికి చెందిన,వెనిగళ్ల జగ్గా ప్రసాద్ రావు ,సీత మహాలక్ష్మి దంపతుల కుమారుడు వెనిగళ్ళ రవికుమార్. మండలంలోని గంధం పల్లి ప్రభుత్వ హై స్కూల్ నందు ప్రాథమిక విద్యాభ్యాసం పొంది , ఉన్నత విద్యను అభ్యసించి అమెరికా లోని పోట్లాండ్ లో స్థిరపడి వారి భార్య రేణుక పలువురి ఎన్ ఆర్ ఐ ల సహాయంతో పుట్టిన గడ్డ కు మన చేతనైన సహాయం చేయాలనే సంకల్పంతో భారత్ లోని పేద విద్యార్థులకు చేతన గ్లోబల్ ఫౌండేషన్ ద్వారా వికలాంగులకు ,వృద్ధులకు,పేద విద్యార్థులకు విద్యను అభ్యసించేందుకు సహాయ సహకారాలు అందిస్తూ వారికి తోడ్పాటు అందిస్తున్నారు. చేతన ఫౌండేషన్ స్థాపించిన గత దశాబ్దాల కాలంగా దేశ విదేశాలకు ఎన్నో స్వచ్ఛంద కార్యక్రమాలను నిర్వహిస్తూ ప్రభుత్వ ప్రజల మన్నలను పొందుతున్నట్లు తెలిపారు.






