హత్యాయత్నానికి పాల్పడిన ముగ్గురిపై కేసు నమోదు

by Bhanu |

హత్యాయత్నానికి పాల్పడిన ముగ్గురు వ్యక్తులపై కేసు నమోదు చేశారు గీసుగొండ పోలీసులు. సీఐ ఎ. మహేందర్ వివరాల ప్రకారం.. మనుగొండ గ్రామానికి చెందిన తుప్పరి భద్రయ్య ఆదివారం రాత్రి సుమారు 7:30 గంటలకు తుప్పరి కృష్ణ స్వామి ఇంటికి కొత్త తలుపులు, దర్వాజా అమర్చేందుకు వెళ్తున్నాడు.

హత్యాయత్నానికి పాల్పడిన ముగ్గురిపై కేసు నమోదు
X

దిశ, గీసుగొండ: హత్యాయత్నానికి పాల్పడిన ముగ్గురు వ్యక్తులపై కేసు నమోదు చేశారు గీసుగొండ పోలీసులు. సీఐ ఎ. మహేందర్ వివరాల ప్రకారం.. మనుగొండ గ్రామానికి చెందిన తుప్పరి భద్రయ్య ఆదివారం రాత్రి సుమారు 7:30 గంటలకు తుప్పరి కృష్ణ స్వామి ఇంటికి కొత్త తలుపులు, దర్వాజా అమర్చేందుకు వెళ్తున్నాడు. అయితే.. ఇదే సమయంలో అదే గ్రామానికి చెందిన తుప్పరి యశ్వంత్, తుప్పరి శ్రీనివాస్, గోకారపు మున్నా అతడిని నిలిపి దుర్భాషలాడారు.


భద్రయ్యను చంపాలని ఉద్దేశించి శ్రీనివాస్ కంట్లో కారం చల్లగా, మున్నా రెండు చేతులు బలంగా పట్టుకుని, యశ్వంత్ కత్తిపీటతో అతడి ఎడమ చెవిపై, తలపై, ఎడమ చేయి మీద దాడి చేసినట్లు తెలిసింది. ఈ దాడిలో భద్రయ్య గాయపడి రక్తస్రావం జరిగింది. అలాగే అతడిని ఎప్పుడైనా చంపిస్తామని బెదిరింపులకు పాల్పడ్డారు. ఈ ఘటనపై బాధితుడు తుప్పరి భద్రయ్య పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధితుడి ఫిర్యాదు మేరకు ముగ్గురు వ్యక్తులపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు పోలీసులు.

Next Story