- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
తండ్రి పై కొడుకు దాడి
by Ratna Kumari |
మండలం కేంద్రంలోని స్థానిక రంగరాజపురం కాలనీకి చెందన రాహుల్ అనే వ్యక్తి తన సొంత తండ్రి అయిన సామియాల్ పై దాడి చేసిన సంఘటన మండల కేంద్రం లో చోటు చేసుకుంది.

X
దిశ, వెంకటాపురం(నూగూరు) : మండలం కేంద్రంలోని స్థానిక రంగరాజపురం కాలనీకి చెందన రాహుల్ అనే వ్యక్తి తన సొంత తండ్రి అయిన సామియాల్ పై దాడి చేసిన సంఘటన మండల కేంద్రం లో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే తండ్రి రోజు మద్యం తాగి ఇంటి వద్ద గొడవ చేస్తున్నాడు. విసుగు చెందిన కొడుకు ఇవాళ కూడా అలాగే చేయడంతో ఇద్దరి మధ్య గొడవ చెలరేగడంతో మాట మాట పెరిగి పక్కనే ఉన్న ట్యూబ్ లైట్ తో తండ్రి మీద దాడి చేయడంతో బలమైన గాయాలు అయ్యాయి. ఇది గుర్తించిన స్థానికులు స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. గాయాలు అధికంగా ఉండడంతో అతడిని ములుగు వైద్యశాలకి తరలించినట్టు సమాచారం. మరోవైపు స్థానికంగా ఇష్టారీతినా గుడుంబా అమ్మకాలు ఎక్కువగా ఉండటం.. అది అదుపులో లేకపోవడంతో తరుచు ఇలాంటి సంఘటనలు చోటు చేసుకుంటున్నాయని స్థానికులు పేర్కొన్నారు.
Next Story






