- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అధికారిగా కార్మికుడి మాయా వేషం.. సహోద్యోగులపై పెత్తనం..!
హనుమకొండ జిల్లా ఆత్మకూరు మండలంలోని గూడెప్పాడు గ్రామ పంచాయతీలో ఓ పారిశుద్ధ్య కార్మికుడు అధికారుల ఆసరాను అవకాశంగా మలిచుకున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

దిశ, హనుమకొండ : హనుమకొండ జిల్లా ఆత్మకూరు మండలంలోని గూడెప్పాడు గ్రామ పంచాయతీలో ఓ పారిశుద్ధ్య కార్మికుడు అధికారుల ఆసరాను అవకాశంగా మలిచుకున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. తనతో కలిసి పని చేసే ఇతర కార్మికులను బాధపెట్టడం, తమతో మాత్రమే పని చేయించడం, తాను మాత్రం పని చెయ్యకుండా బెదిరింపులకు పాల్పడడం వంటి వ్యవహారాలు కార్మికుల ఆవేదనకు కారణమవుతున్నాయి. సామాజిక వర్గానికి చెందిన పారిశుద్ధ్య కార్మికుడు, విధుల్లోకి సరిగ్గా రాకుండా, తోటి పారిశుద్ధ్య కార్మికులపై పెత్తనం చెలాయిస్తూ ఉంటాడని , ఇతర కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
జీతం వస్తోంది.. పని లేదు..
గ్రామ పంచాయతీలో నలుగురు పారిశుద్ధ్య కార్మికులు పనిచేస్తుండగా, వారిలో ఓ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి తనను అధికారి అనిపించుకొని అధికార ధోరణిలో వ్యవహరిస్తున్నాడని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. మిగతా కార్మికులను విధుల్లో ఇబ్బంది పెడుతున్నట్లుగా, పనిలో మాత్రం ఆ పారిశుద్ధ్య కార్మికుడు భాగస్వామ్యం పాలుపంచుకోకుండా వ్యవహరిస్తున్నాడని, తన నోటికి ఎంత వస్తే అంతే మాట్లాడుతాడని, తోటి పారిశుద్ధ్య కార్మికులు ఆరోపించడం గమనార్హం. ఆ కార్మికుడిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని గ్రామ పంచాయతీ కార్యదర్శి కి లేటర్ రూపంలో ఫిర్యాదు కూడా అందినట్లు తెలుస్తోంది.. మండల అధికారులకు కూడా ఫిర్యాదు చేశారు అని ఆరోపణలు వినిపిస్తున్నాయి.
అధికారుల మౌనం.. పారిశుద్ధ్య కార్మికుడిపై చర్యలు శూన్యం..
కార్మికుల ఫిర్యాదులు అందినప్పటికీ సంబంధిత అధికారులు స్పందించక పోవడం తీవ్ర నిరాశకు గురిచేస్తోంది. పంచాయతీ సెక్రటరీ, మండల స్థాయి అధికారులు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు అనే ప్రశ్నలు స్థానికంగా చర్చకు వస్తున్నాయి. తోటి పారిశుద్ధ్య కార్మికులను తీవ్ర ఇబ్బందికి గురి చేస్తున్న సదరు కార్మికుడిపై అధికారులు చర్యలు తీసుకోవాలని, అతను సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిని అంటూ నోటికొచ్చిన విధంగా మాట్లాడం, విధులు నిర్వహించకుండా, తోటి కార్మికులపైన పని బారం మోపుతూ ఉంటాడని, తోటి కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయినప్పటికీ అధికారులు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదనట్టు తోటి పరిశుద్ధ కార్మికుల్లో పలు అనుమానాలకు దారి తీస్తుంది అని తోటి కార్మికులు ఆరోపించడం గమనార్హం.
ప్రజల్లో గుసగుసలు.. సామాజిక సమగ్రతకే ముప్పు..
సంబంధిత వ్యక్తి వెనుక రాజకీయ లేదా అధికార మద్దతు ఉందా అనే అనుమానాలు గ్రామస్థుల మధ్య గుస గుసలుగా మారుతున్నాయి. చేస్తున్న పనికి అధికారుల మద్దతే కారణమై ఉంటుంది అనే మాటలు వినిపిస్తున్నాయి. ఒకరిపై మరొకరు అధికారంగా చెలరేగడం పంచాయతీ స్థాయిలో సమానత్వాన్ని భంగం చేస్తుందని సామాజిక కార్యకర్తలు హెచ్చరిస్తున్నారు. ఈ వ్యవహారంపై ఉన్నతాధికారులు వెంటనే స్పందించి బాధ్యత వహించక పోతే, ఈ సమస్య మరింత ఘర్షణలకు దారి తీయవచ్చని వారు హెచ్చరిస్తున్నారు.
గూడెప్పాడ్ కార్యదర్శి వివరణ..
సామాజిక వర్గానికి చెందిన పారిశుద్ధ్య కార్మికుడు తోటి కార్మికులతో సమానంగా పని చేయకుండా, అలా ఎప్పటికీ నడుస్తుందని తోటి కార్మికులు సదరు గ్రామ కార్యదర్శికి లేటర్ రూపంలో ఫిర్యాదు ఇచ్చారని, అతని వ్యవహారం పై గ్రామ సభలో చర్చిస్తానని, తెలిపారు. నాకు ఏం పని చెప్పకండి, నేను ఏం పని చేయను అని గ్రామ పంచాయతీ కార్యదర్శి తోనే అలా అంటున్నాడని, నేను ఒక లీడర్ ను నాకు ఏం పని చెప్పకండి అంటూ సదరు పారిశుద్ధ్య కార్మికుడు సమాధానం ఇస్తూ ఉంటాడని, తోటి ముగ్గురి కార్మికులతో పని చేయించడం వల్ల నాకు పని అందడం లేదని, గ్రామ పంచాయతీ కార్యదర్శి వివరణ ఇచ్చారు.
- Tags
- Atmakur mandal
- Gudepadu village
- sanitation worker controversy
- worker power abuse
- social discrimination
- Telangana news
- Hanumakonda district
- Panchayat disputes
- social justice issues
- worker complaints
- panchayat secretary
- official inaction
- worker grievances
- workplace harassment
- social integrity
- community unrest
- local politics






