ఏటీఎం కార్డుల దొంగ అరెస్టు...

by Bhanu |   (  Updated:2025-06-13 15:22:34  IST  )

ఏటీఎం కేంద్రాల్లో నగదు తీసుకోవడానికి వచ్చిన వారి నుంచి చాకచక్యంగా ఏటీఎం కార్డులు తస్కరించి, పిమ్మట డబ్బులు డ్రా చేసి జల్సాలు చేస్తున్న దొంగను జనగామ పోలీసులు అరెస్టు చేశారు.

ఏటీఎం కార్డుల దొంగ అరెస్టు...
X

దిశ, జనగామ: ఏటీఎం కేంద్రాల్లో నగదు తీసుకోవడానికి వచ్చిన వారి నుంచి చాకచక్యంగా ఏటీఎం కార్డులు తస్కరించి, పిమ్మట డబ్బులు డ్రా చేసి జల్సాలు చేస్తున్న దొంగను జనగామ పోలీసులు అరెస్టు చేశారు. జనగామ పండరి చేతన్ నితిన్ ఏ సి పి ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఇందుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు.గుంటూరు జిల్లా ఇనుమెల్ల చెందిన వెంకట కోటేశ్వరరావు పలు ఏటీఎం కార్డుల చోరీ కేసుల్లో అరెస్టయి జైలు శిక్ష కూడా అనుభవించాడు. ఈ నేపథ్యంలో భూక్య భాస్కర్ మచ్చు పహాడ్ సూర్య బండ తండ ఎస్‌బీఐ ఏటీఎం సెంటర్‌లో ఏటీఎం కార్డుతో నగదు డ్రా చేయడానికి వెళ్లగా నగదు తీసుకున్న తర్వాత అక్కడే వున్న వెంకట కోటేశ్వరరావు వారి ఏటీఎం కార్డుని దొంగలించాడు.

అనంతరం డబ్బులు డ్రా చేశాడు. మరుసటి రోజు ఈ విషయాన్ని గమనించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. వెంటనే కేసు నమోదు చేసిన జనగామ పోలీసులు, క్రైమ్‌ సిబ్బంది దర్యాప్తు చేసి సీసీ కెమెరాల ఫుటేజీ ఆధారంగా ఏటీఎం కార్డు చోరీకి పాల్పడింది పాత నేరస్థుడు వెంకట కోటేశ్వరరావుగా గుర్తించారు. అతని కోసం గాలింపు చర్యలు చేపట్టగా.. పెట్రోలింగ్ చేస్తున్న జనగామ పోలీసులకు జనగామ బస్టాండు రోడ్డులో గల వైన్స్ ప్రక్కన పట్టుబడ్డాడు. నిందితుడిని అదుపులోకి తీసుకుని అరెస్టు చేశారు. పలు ఏటీఎం కార్డులు, సెల్‌ ఫోను, రూ.10 వేల నగదు స్వాధీనం చేసుకున్నారు. విచారణ చేపట్టగా ముందుగా ఎంచుకున్న ఏటీఎం కేంద్రం వద్ద కాపు కాస్తాడు. ఎవరైనా వ్యక్తులు ఏటీఎం కార్డుతో డబ్బులు తీసుకొని, మిషన్‌ నుంచి కార్డు బయటకు తీయకుండా డబ్బులు లెక్క పెట్టుకోవడం గమనిస్తాడు.

డబ్బులు లెక్కపెట్టుకునే లోపు ఏటీఎం మిషన్‌లోని కార్డు తీసి వారికి ఇచ్చే క్రమంలో కార్డు మార్చేస్తాడు. తన వద్ద ఉన్న పనికిరాని ఏటీఎం కార్డు వారికిచ్చి, వారి కార్డు పట్టుకు పోతాడు. అనంతరం వారి ఖాతాలో నుంచి డబ్బులు డ్రా చేస్తాడు. ఇలా చాలా ఏటీఎం కార్డులు తస్కరించినట్టు వెంకట కోటేశ్వరరావు ఒప్పుకున్నాడని ఏసీబీ చెప్పారు. ఏటీఎం ల వద్ద డబ్బులు డ్రా చేసే విషయంలో ప్రజలు జాగ్రత్త వహించాలని కోరారు. నిందితుడిని పట్టుకోవడంలో ప్రతిబకనపరిచిన జనగామ ఇన్స్పెక్టర్ దామోదర్ రెడ్డి, ఎస్సై భరత్, కానిస్టేబుల్ కర్ణాకర్ సాగర్ మహేందర్ మరి ఎండి సల్మాన్ లను సిపి వరంగల్ కమిషనర్ అభినందించారని తెలిపారు.

Next Story