దిశ ఎఫెక్ట్ : హుటా హుటిన కదిలిన ఐబీ అధికారులు

by Bhanu |   (  Updated:2025-07-23 05:51:46  IST  )

ఉదయం దిశ వెబ్ లింక్ లో వచ్చిన ‘అధికారుల నిర్లక్ష్యానికి బలైన బెస్తవాడ.. అత్త చెరువు తూము లీకేజీతో అంతా ఆగమాగం..’

దిశ ఎఫెక్ట్ : హుటా హుటిన కదిలిన ఐబీ అధికారులు
X

దిశ, మంగపేట : ఉదయం దిశ వెబ్ లింక్ లో వచ్చిన ‘ అధికారుల నిర్లక్ష్యానికి బలైన బెస్తవాడ.. అత్త చెరువు తూము లీకేజీతో అంతా ఆగమాగం...’ వార్తకు మండల ఐబీ ఏఈ వలీం మహ్మద్, తహసీల్దార్ తోట రవీందర్,ఎస్సై టీవీఆర్ సూరి, ఎంపీడీవో భద్రులు వెంటనే స్పందించారు. దిశలో వచ్చిన వెబ్వా లింక్ వార్తతో హుటా హుటిన మల్లూరు అత్త చెరువు ప్రాంతంలోని బెస్తవాడ( మైసమ్మ సెటర్) కు చేరుకున్న అధికారులు ముంపు బాదిత ప్రజలను పరామర్శించి ఇళ్లలోకి నీరు చేరిన ప్రజలను సురక్షిత ప్రాంతాలకు వెల్లాలని సూచించారు.

తూము లీకేజీని సుమారు 80 నుండి 100 ఇసుక బస్తాలు, గడ్డితో పూడ్చేందుకు ఐబీ ఏఈ వలీం మహ్మద్ ఆధ్వర్యంలోని బృందం స్థానిక ప్రజలతో కలిసి యుద్ధప్రాతి పదికన పనులు చేస్తున్నారు. ఇసుక బస్తాలు, గడ్డి తూములోకి జారవిడుస్తూ లీకు మూసే పనులు ముమ్మరంగా చేస్తుండగా ఎడతెరిపి లేని కుంభ వృష్టి వర్షం పనులు సాగకుండా ఆటంకంగా మారింది. అయినప్పటికీ తూము లీకును ఆపి వరద బయటకు రాకుండా చేశారు. దిశ కథనంతో కదిలిన అధికారులను, దిశను మల్లూరు గ్రామస్తులు, ముఖ్యంగా బెస్తవాడ కుటుంబాలు అభినందించాయి...

Next Story