దిశ ఎఫెక్ట్: రోడ్డుపై లారీలకు పార్కింగ్ చేస్తే కఠిన చర్యలు : ఏఎస్పీ శివం ఉపాధ్యాయ

by Bhanu |

దిశ వెబ్ లింక్‌లో ప్రచురితమైన 'గుట్ట రోడ్డులో ఇసుక లారీల పార్కింగ్' వార్తపై ఎట్టకేలకు అధికారుల నుంచి స్పందన వచ్చింది.

దిశ ఎఫెక్ట్: రోడ్డుపై లారీలకు పార్కింగ్ చేస్తే కఠిన చర్యలు : ఏఎస్పీ శివం ఉపాధ్యాయ
X

దిశ, మంగపేట: దిశ వెబ్ లింక్‌లో ప్రచురితమైన 'గుట్ట రోడ్డులో ఇసుక లారీల పార్కింగ్' వార్తపై ఎట్టకేలకు అధికారుల నుంచి స్పందన వచ్చింది. ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణించిన ఏటూరునాగారం ఏఎస్పీ శివం ఉపాధ్యాయ స్పందిస్తూ, రోడ్లపై లారీలను పార్క్ చేయడం ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధమని, ఇకపై అలాంటి ఘటనలు జరగకుండా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.

మంగళవారం టీఎస్‌ఎండీసీ ప్రాజెక్ట్ ఆఫీసర్ (పీవో), మల్లూరు ఇసుక క్వారీ కాంట్రాక్టర్‌తో ఏటూరునాగారం ఎఎస్‌పీ కార్యాలయంలో సమావేశమై, క్వారీకి వచ్చే లారీల కోసం ప్రత్యేక పార్కింగ్ స్థలాన్ని ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ప్రభుత్వ నిబంధనల మేరకే ఇసుకను తరలించాలని, పరిమితికి మించి ఆన్లైన్ బుకింగ్స్ చేయొద్దని హెచ్చరించారు.

రోడ్లపై పార్కింగ్ చేస్తే డ్రైవర్లపై చట్టపరమైన చర్యలు తప్పవని, ఇలాంటివి మళ్లీ చోటు చేసుకోకుండా కఠినంగా వ్యవహరిస్తామని అధికారులపై స్పష్టం చేశారు. దిశ వార్తలపై స్పందన ఇస్తూ తీసుకున్న ఈ చర్యలు ప్రజలలో సంతృప్తిని కలిగిస్తున్నాయి.

Next Story