- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
'దిశ' కథనానికి స్పందన.. మల్లూరువాగు ప్రాజెక్టుకు అండర్ వాటర్ రిపేర్ సర్వీసు టీం రాక
దిశ, మంగపేట : మల్లూరు వాగు మద్యదతరహా ప్రాజెక్టు కుడి కాలువ షట్టర్ చానల్ రాడ్ లింక్ సమస్యతో కాలువకు నీరు రాక పోవడం

దిశ, మంగపేట : మల్లూరు వాగు మద్యదతరహా ప్రాజెక్టు కుడి కాలువ షట్టర్ చానల్ రాడ్ లింక్ సమస్యతో కాలువకు నీరు రాక పోవడంతో ఆయకట్టు తైబంధీలోని రైంతాంగం పోసుకున్న రభీ వరినారు మల్లు ఎండుతున్న విషయాన్ని ‘ దిశ దిన పత్రిక జిల్లా టాబ్లాయిడ్ లో సోమవారం ’ వెలుగులోకి తేవడంతో స్పందించిన మండల కాంగ్రెస్ నాయకులు స్పందించి రైతుల పరిస్థితిని మంత్రి సీతక్క దృష్టికి తేవడంతో వెంటనే స్పందించిన మంత్రి సీతక్క వైజాగ్ నుంచి ఎం.కె. అండర్ వాటర్ సర్వీస్ నుంచి మంగరాజు ఆద్వర్యంలోని డైవింగ్ టీం ప్రాజెక్టును సందర్శించింది. ఐబీ డీఈ రవికుమార్, ఏఈఈ వలీం మహ్మద్ లు వెంటనే ప్రాజెక్టు పరిస్థితిని వివరించడంతో డైవింగ్ బృంధం ప్రాజెక్టు కుడి గేటులోని 20 ఫీట్ల లోతులోకి ఆక్సీజన్ ట్యాంకుల సహాయంతో దిగి తూము షట్టర్ పరిస్థితిని పరిశీలించారు. కింది బాగములోని షూ యాక్షన్ ఉదృతి ఎక్కువగా ఉండడంతో పాటు చీకటి అవుతుండడంతో బయటకు వచ్చిన డైవింగ్ బృంధం మంగళవారం పరిస్థితిని చక్కబెట్టనున్నట్లు తెలిపారు. రైతుల పరిస్థితిపై వెంకటనే స్పందించిన మంత్రి సీతక్క, ఐబీ అధికారులు, స్థానిక కాంగ్రెస్ నాయకులకు రైతులు కృతజ్ఞతలు తెలిపారు.






