- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పేకాట రాయుళ్ల అరెస్ట్..
పేకాట రాయుళ్లను పోలీసులు అరెస్ట్ చేసిన సంఘటన ఏటూరు నాగారం మండల పరిధిలో బుధవారం జరిగింది.

దిశ, ఏటూరు నాగారం: పేకాట రాయుళ్లను పోలీసులు అరెస్ట్ చేసిన సంఘటన ఏటూరు నాగారం మండల పరిధిలో బుధవారం జరిగింది. ఎస్ఐ రమేష్ తెలిపిన వివరాల ప్రకారం.. బుధవారం మధ్యాహ్న సమయంలో రాంనగర్ గ్రామంలోని ముత్యాలమ్మ గుడి వెనక ప్రాంతంలో పేకాట ఆడుతున్నారన్నా పక్కా సమాచారం మేరకు పోలీసులు దాడులు నిర్వహించారు.
ఈ సందర్భంగా ఏటూరునాగారంకు చెందిన గారా గణపతి, రాంనగర్ కు చెందిన గారా గాంధీలను అరెస్ట్ చేయగా, మిగిలిన ఆరుగురు గార నగేష్ , బొల్లె వెంకటేశ్, బొల్లె రాజబాబు, నర్సింగరావు, తోట శ్రీకాంత్, అల్లి లక్ష్మయ్యలు పారిపోయారు. పట్టుబడిన వారి నుంచి రూ. 12,530 నగదు స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. కాగా పేకాట, కోడి పందాలు, పీడీఎస్ బియ్యం దందా వంటి చట్ట వ్యతిరేకమైన పనులకు పాల్పడితే ఉపేక్షించేది లేదని ఎస్సై హెచ్చరించారు.






