భర్తను హత్య చేయించిన కేసులో భార్యతో పాటు నిందితుల అరెస్ట్‌

by Ratna Kumari |

వివాహేత‌ర‌ సంబంధానికి భర్త అడ్డుగా ఉన్నాడని భార్య, ప్రియుడు కలిసి సుఫారీ ఇచ్చి భర్తను చంపించిన కేసును వరంగల్ పోలీస్‌ కమిషనరేట్ పోలీసులు ఛేదించారు.

భర్తను హత్య చేయించిన కేసులో భార్యతో పాటు నిందితుల అరెస్ట్‌
X

దిశ, వరంగల్ బ్యూరో : వివాహేత‌ర‌ సంబంధానికి భర్త అడ్డుగా ఉన్నాడని భార్య, ప్రియుడు కలిసి సుఫారీ ఇచ్చి భర్తను చంపించిన కేసును వరంగల్ పోలీస్‌ కమిషనరేట్ పోలీసులు ఛేదించారు. అక్రమ సంబంధానికి అడ్డుగా ఉన్నాడని భర్తను హత్య చేయించిన భార్యతో పాటు నిందితుల‌ను పోలీసులు అరెస్ట్‌ చేశారు. హనుమకొండ లోని వరంగల్ పోలీసు కమిషనరేట్ కార్యాలయంలో శుక్రవారం ఈస్ట్ జోన్ డీసీపీ అంకిత్ కుమార్ ఐదుగురి నిందితులను అరెస్ట్ చూపించి వివరాలు వెల్లడించారు. ఈ నెల 8న వరంగల్ పోలీసు కమిషనరేట్ పరిధి పరకాల టౌన్ కు చెందిన మడికొండ సుమన్ భరత్ కనబడడం లేదని తండ్రి సాంబయ్య పిర్యాదు చేశాడన్నారు. పోలీసులు దర్యాప్తు చేపట్టగా ఊహించని విధంగా భార్య లావణ్యనే భర్తను చంపించినట్లు తేలిందన్నారు.

లావణ్యకు పరకాలకు చెందిన ఇమ్మడి నరేష్ తో వివాహేతర సంబంధం ఉందన్నారు. ఈ విషయంలో భర్త సుమన్ భరత్ మద్యం సేవించి భార్య లావణ్యను హించినే వాడన్నారు. భర్త అక్రమ సంబంధానికి అడ్డుగా ఉన్నాడని ప్రియుడు నరేష్, ఆమె తమ్ముడు పెండల రాజు కలిసి భరత్ ను హత్య చేయడానికి ములుగు జిల్లా గోవిందారావు పేటకు చెందిన చిరంశెట్టి వెంకటేశ్వర్లు, భూక్య రాకేష్ తో సుఫారీ కుదుర్చుకున్నన్నారు. హత్యకు రూ.5లక్షలు డీల్ కుదుర్చుకొని రూ.4లక్షల,60 వేలు ఇచ్చారన్నారు. ఏప్రిల్ 3 న వెంకటేశ్వర్లు, రాకేష్ మృతుడు భరత్ ను ములుగుకు పిలుపించుకున్నారన్నారు. ముగ్గురు మద్యం సేవించారన్నారు. అక్కడి నుంచి వెంకటేశ్వర్లు వ్యవసాయ భూమి వద్దకు వెళ్లి, వెంకటేశ్వర్లు, రాకేష్ ఇద్దరు కలిసి భరత్ తల పై బీర్ బాటిల్ కొట్టి చంపి, పెట్రోల్ పోసి తగలబెట్టారన్నారు. వీడియో తీసి లావణ్య ఫోన్ కు పంపించారన్నారు. భరత్ డెడ్ బాడీని కాల్చి, ఆనవాళ్లు లేకుండా బొక్కలను సమీపంలోని వాగులో పడేశారన్నారు. తరువాత లావణ్య రూ.40 వేలు వెంకటేశ్వర్లకు అందజేసినట్లు విచారణలో తేలిందని డీసీపీ తెలిపారు. ఈ ప్రెస్ మీట్ లో పరకాల అధికారులు పాల్గొన్నారు.

Next Story