- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
వరంగల్ ఎనుమాముల మార్కెట్ పాలకవర్గం నియామకం
వరంగల్ ఎనుమాముల మార్కెట్ పాలకవర్గాన్ని ఎట్టకేలకు ప్రభుత్వం నియమించింది.

దిశ, వరంగల్ బ్యూరో : వరంగల్ ఎనుమాముల మార్కెట్ పాలకవర్గాన్ని ఎట్టకేలకు ప్రభుత్వం నియమించింది. పాలకవర్గ సభ్యులు, చైర్మన్ తో సహా బాధ్యతలు చేపట్టారు. రాజకీయంగా మారిన చైర్మన్ పదవీ ని నాలుగేళ్ల తర్వాత భర్తీ చేశారు. మార్కెట్ పరిధిలోని పలు గ్రామాల వారితో పాటు వ్యాపారులకు సభ్యులుగా అవకాశం కల్పించారు. వరంగల్ ఎనుమాముల మార్కెట్ కమిటీ పాలకవర్గాన్ని ప్రభుత్వం నియమించింది. చైర్మన్ తో సహా మొత్తం 18 మంది సభ్యుల నియామకం చేసింది. ఈ మేరకు రాష్ట్ర వ్యవసాయ సహకార శాఖల కార్యదర్శి ఉత్తర్వులు జారీ చేశారు.
చైర్మన్ పదవీ ఎస్సీ మహిళకు కేటాయించారు. రెండేళ్ల పాటు చైర్మన్ తో పాటు సభ్యులు పదవిలో కొనసాగుతారని ప్రకటించారు. మార్కెట్ కమిటీ చైర్మన్ గా ఎర్ర ప్రియాంకను నియమించారు. వైస్ చైర్మన్ గా బండి జనార్ధన్, సభ్యులుగా గండరబోయిన రాజు, కందుకూరి పూర్ణచందర్, సల్లా వాగ్దేవరెడ్డి, గొడుగు బిక్షపతి, బాదావత్ నర్సింహానాయక్, ఆకుల రుద్రప్రతాప్, బొడ్డు ప్రదీప్ కుమార్, కత్తి సంపత్, మహ్మద్ సబేరా, అక్స నాగరాజ్, దుగ్యాల గోపాల్ రావు, గజ్జల శ్యామ్ సుందర్ తో పాటు అసన్పర్తి ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం చైర్మన్ జిల్లా మార్కెటింగ్ ఆఫీసర్ అసిస్టెంట్ డైరెక్టర్ అగ్రికల్చర్ వరంగల్ మేయర్ కూడా సభ్యులుగా నియామకం చేశారు. కమిటీ సభ్యులంతా బుధవారం మార్కెట్ కమిటీ కార్యాలయంలో బాధ్యతలను చేపట్టారు. పాలకవర్గాన్ని నియమించలేదని దిశలో కథనాలు ఇచ్చాం. ఎస్సీకి కేటాయించడం వల్లనే ఆలస్యమవుతుందని పట్టించుకోవడం లేదని వచ్చిన కథనానికి స్పందనగా ఈ నియామకం చేశారు.






