- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Home > జిల్లా వార్తలు > వరంగల్ > ఇందిరమ్మ ఇళ్ల కోసం మార్చి 5లోపు దరఖాస్తులు సమర్పించాలి : ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి
ఇందిరమ్మ ఇళ్ల కోసం మార్చి 5లోపు దరఖాస్తులు సమర్పించాలి : ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి
by Ratna Kumari |
ప్రభుత్వ ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇళ్ల పథకంలో పార్టీలకు అతీతంగా అర్హులైన ప్రతి ఒక్కరికీ ఇళ్లు మంజూరు చేస్తామని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి తెలిపారు.

X
దిశ, హనుమకొండ కలెక్టరేట్ : ప్రభుత్వ ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇళ్ల పథకంలో పార్టీలకు అతీతంగా అర్హులైన ప్రతి ఒక్కరికీ ఇళ్లు మంజూరు చేస్తామని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి తెలిపారు. ఇందిరమ్మ ఇల్లు కోసం దరఖాస్తు చేసుకోవాలనుకునే వారు బాలసముద్రంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ప్రత్యేక డెస్క్ ఏర్పాటు చేశామని మార్చి 5 లోపు దరఖాస్తు చేసుకోవాలని ఆయన సూచించారు. దరఖాస్తుల ప్రక్రియలో ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో తమ సిబ్బంది పూర్తి స్థాయిలో అందుబాటులో ఉంటారని తెలిపారు. ప్రతి డివిజన్‌లో కార్పొరేటర్లు కూడా ప్రజలకు అవసరమైన సహకారం అందించాలని సూచించారు. అర్హులైన ప్రతి ఒక్కరూ కూడా పథకం లబ్ధి నుంచి దూరం కాకుండా సమన్వయంతో చర్యలు తీసుకుంటామని తెలిపారు.
Next Story






