- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ప్రజాభిమానాన్ని పొందేలా అంగన్వాడీ విధులు సాగాలి: మంత్రి సీతక్క
చిన్నపిల్లలు దేవుళ్లతో సమానంగా అంగన్వాడీ టీచర్లు చూసుకోవాలని మంత్రి దనసరి అనసూయ(సీతక్క) అన్నారు.

దిశ, ములుగు జిల్లా ప్రతినిధి: రాష్ట్రంలో పేదరికంలో ఉన్న పిల్లలను ఆరోగ్యంగా ఉంచడం కోసమే ప్రభుత్వం బలమైన ఆహారం అందించడానికి చర్యలు తీసుకుంటుందని, చిన్నపిల్లలు దేవుళ్లతో సమానంగా అంగన్వాడీ టీచర్లు చూసుకోవాలని మంత్రి దనసరి అనసూయ(సీతక్క) అన్నారు. ప్రజా ప్రభుత్వం అంగన్వాడీ టీచర్లకు ఇచ్చిన హామీలను కచ్చితంగా నెరవేర్చడానికి కృషి చేస్తుందని తెలిపారు. అంగన్వాడీ సెంటర్ లపై నమ్మకం కలిగేలా విధులు నిర్వహించాలని ఆమె సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టిన స్కూల్ పిల్లలకు ప్రతి రోజూ 100 మి.లీ. పాల పంపిణీ పైలెట్ ప్రాజెక్టును జిల్లా కలెక్టర్ దివాకర్ టిఎస్, ఐటీడీఏ పీవో చిత్రమిశ్ర, అదనపు కలెక్టర్ మహేందర్ జి లతో కలిసి ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి మాట్లాడుతూ.. అంగన్వాడీ కేంద్రాల్లో 3 నుండి 6 సంవత్సరాల వయసు కలిగిన పిల్లలకు ప్రతిరోజు పాలన అందజేయడం జరుగుతుందని, ములుగు జిల్లాలో పేదరికంలో ఉన్న పిల్లలు అధిక సంఖ్యలో ఉండడంతో ఈ నూతన కార్యక్రమాన్ని ఇక్కడి నుంచే ప్రారంభించడం జరిగిందని వివరించారు. పిల్లలకు అందించే ప్రతి ఆహారాన్ని అంగన్వాడీ టీచర్లు ప్రతిరోజు పరిశీలించాలని, అనారోగ్యానికి గురి చేసే వస్తువులు వచ్చిన పక్షంలో వెంటనే ఫిర్యాదు చేయాలని సూచించారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంగన్వాడి సెంటర్లను బలోపేతం చేయడానికి ఇప్పటికే పలు నిర్ణయాలు తీసుకున్నారని, ప్రతి టీచర్ కు చీరలు పంపిణీ చేయడంతో పాటు వేతనాలను పెంచడం జరిగిందని అన్నారు. సొంత పిల్లల్లాగానే అంగన్వాడి పిల్లలను చూసుకోవాలని, ప్రతి ఒక్కరూ తమ పిల్లల్ని సైతం అంగన్వాడి సెంటర్లో చేర్పించాలని తెలిపారు. కార్పొరేట్ స్థాయి పాఠశాలకు దీటుగా సెంటర్లను బలోపేతం చేస్తున్నామని, ప్రతి సెంటర్ నిర్వాహకులు పిల్లల తల్లిదండ్రులతో నిత్యం సమావేశాలు నిర్వహించాలని సూచించారు. అంగన్వాడీ టీచర్లు అనుకోకుండా మృతి చెందిన పక్షంలో వారి పిల్లలకు ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి ప్రభుత్వం జీవో జారీ చేస్తుంది.
సెంటర్లకు చెడ్డ పేరు రాకుండా ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా విధులు నిర్వహించాలని అన్నారు. కలెక్టర్ దివాకర్ టిఎస్ మాట్లాడుతూ నూతన కార్యక్రమాన్ని ములుగు జిల్లా నుండి ప్రారంభించడం సంతోషకరంగా ఉందని, జిల్లాలోని ప్రతి సెంటర్లో పిల్లలకు సరిపోను ఆట వస్తువులు, బలమైన ఆహారం అందించడానికి చర్యలు తీసుకుందామని వివరించారు. పిల్లలకు పౌష్టికాహారం అందించడానికి ప్రతి ఒక్కరూ చొరవ చూపాలని అన్నారు. కార్యక్రమంలో గ్రంథాలయ సంస్థ చైర్మన్ రవి చందర్, మార్కెట్ కమిటీ చైర్మన్ రేగ కళ్యాణి, ఆత్మ కమిటీ చైర్మన్ రవీందర్ రెడ్డి, డిడబ్ల్యూఓ తుల రవి, సిడిపిఓ శిరీష, అంగన్వాడీ టీచర్లు తదితరులు పాల్గొన్నారు.






