- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
అనంతాద్రి దేవాలయం అభివృద్ధి చేస్తా : ఎమ్మెల్యే మురళీ నాయక్
మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని అనంతాద్రి భూనిల శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో 21వ బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తున్నారు.

దిశ, మహబూబాబాద్ టౌన్ : మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని అనంతాద్రి భూనిల శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో 21వ బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తున్నారు. ఈ ఉత్సవాలకు ఎమ్మెల్యే మురళీ నాయక్, డీసీసీ అధ్యక్షురాలు ఉమా మురళీ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత 10 సంవత్సరాలుగా ఆలయం నిర్లక్ష్యానికి గురైందని పేర్కొన్నారు. ఆలయాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తామని తెలిపారు. భక్తులకు సౌకర్యాలు మెరుగుపరచడం తమ ప్రధాన లక్ష్యమని తెలిపారు. ఆలయం చుట్టూ గిరి ప్రదక్షిణ చేయడానికి సీసీ రోడ్డు నిర్మాణం చేపడతామని ఎమ్మెల్యే ప్రకటించారు. అదేవిధంగా భక్తులకు సౌకర్యంగా ఉండేందుకు కల్యాణ మండపం నిర్మాణానికి కూడా కృషి చేస్తామని తెలిపారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా ఆలయానికి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ ప్రధాన అర్చకులు చక్రధరచార్యులు, ప్రజాప్రతినిధులు, ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.






