- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
వృద్ధురాలిపై ఎస్సై దాడి..!?
వృద్ధరాలిపై ఓ ఎస్సై దాడి చేశారంటూ వరంగల్ నగరంలో ప్రచారం జోరుగా సాగుతోంది. దీనికి సంబంధించి ఓ వీడియో సైతం వైరల్

దిశ, నర్సంపేట: వృద్ధరాలిపై ఓ ఎస్సై దాడి చేశారంటూ వరంగల్ నగరంలో ప్రచారం జోరుగా సాగుతోంది. దీనికి సంబంధించి ఓ వీడియో సైతం వైరల్ అవుతోంది. వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని మిల్స్ కాలనీ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటుచేసుకుంది. బాధితులు దీనికి సంబంధించి పిర్యాదు సైతం చేసినట్లు సమాచారం. ఫోర్ట్ రోడ్డులోని ఓ రెస్టారెంట్లోకి సదరు ఎస్సై శుక్రవారం రాత్రి చేరుకున్నారు. గ్యాస్ సిలిండర్ తీస్తుండటంతో ఎందుకు తీస్తున్నారని నిర్వాహకులు ప్రశ్నించినట్లు తెలుస్తోంది. సమయం అయ్యేలోపు తీస్తామని చెప్పినప్పటికీ వినలేదని బాధితుల వాదన. ఈ క్రమంలో ఇరువురి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. గొడవ పెద్దది కావడంతో ఎస్సై దాడి చేసి కొట్టినట్లు బాధితురాలు ఆరోపిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి భిన్న వాదనలు ఉన్నప్పటికీ వృద్ధురాలిపై దాడి జరిగిందని ప్రచారం కావడంతో జిల్లా వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది. పూర్తి విచారణ అనంతరం అసలు నిజం వెలుగులోకి రానుంది.






