- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కోతులు తరమడంతో ఇంటర్ విద్యార్థినికి తీవ్ర గాయాలు
కోతులు తరమడంతో ఇంటర్ విద్యార్థినికి తీవ్రగాయాలయ్యాయి. ఈ ఘటన ఎల్కతుర్తి మండల కేంద్రంలో చోటు చేసుకుంది.

దిశ, ఎల్కతుర్తి : కోతులు తరమడంతో ఇంటర్ విద్యార్థినికి తీవ్రగాయాలయ్యాయి. ఈ ఘటన మండల కేంద్రంలో చోటు చేసుకుంది. ఎల్కతుర్తి కస్తూర్బా బాలికల రెసిడెన్షియల్ స్కూల్ లో ఇంటర్మీడియట్ రెండో సంవత్సరం చదువుతోంది రమ్య అనే విద్యార్థిని. అకస్మాత్తుగా హాస్టల్ వద్దకు కోతులు రావడంతో భయంతో తప్పించుకునే క్రమంలో మెట్ల పై నుంచి కింద పడిపోయింది. దీంతో రమ్య కి తీవ్ర గాయాలయ్యాయి. ప్రిన్సిపాల్, సిబ్బంది వెంటనే ప్రథమ చికిత్స చేయించారు. ఇవాళ మ్యాథ్స్ ఎగ్జామ్ ఉండటంతో మోడల్ స్కూల్ సెంటర్ కి పరీక్ష రాసేందుకు వెళ్లింది. అయితే పరీక్ష రాస్తున్న సమయంలో కొద్ది సేపటికే ఆమె ముక్కులోంచి రక్తం రావడంతో వెంటనే రమ్యని అంబులెన్స్ లో వరంగల్ ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. కోతుల బెడద నుంచి రక్షించాలని విద్యార్థినిలు, తల్లిదండ్రులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.






