- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సినిమా షూటింగ్ కోసం లొకేషన్ చూపిస్తుండగా ప్రమాదం.. వ్యక్తి మృతి
శంకరపల్లి, గండిపేట నాలుగు లైన్ల రహదారిపై మోకిలా వద్ద శనివారం టంగుటూరు గ్రామస్తులు రాస్తారోకో నిర్వహించారు.

దిశ, శంకర్ పల్లి: శంకరపల్లి, గండిపేట నాలుగు లైన్ల రహదారిపై మోకిలా వద్ద శనివారం టంగుటూరు గ్రామస్తులు రాస్తారోకో నిర్వహించారు. వివరాల్లో వెళితే.. శంకర్ పల్లి మండలం టంగుటూరు గ్రామానికి చెందిన బద్దం శంబారెడ్డి (50) శుక్రవారం అర్ధరాత్రి గ్రామంలో సినిమా షూటింగ్ జరిగే చోట కరెంట్ షాక్ తగిలి మృతి చెందాడు. గ్రామస్తులకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా శవాన్ని చేవెళ్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించడంపై గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. మోకి లలో రాస్తారోకోకు ఉపక్రమించారు. శంకర్ పల్లి సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున పోలీసులు మోహరించారు. మోకిల పోలీస్ స్టేషన్ పోలీసులు కూడా సంఘటన స్థలానికి చేరుకున్నారు. తమకు తెలియకుండా శవాన్ని గ్రామం నుంచి ఎలా తరలిస్తారని గ్రామస్తులు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. గ్రామస్తులతో పాటు కుటుంబ సభ్యులు ,మహిళలు యువకులు పెద్ద ఎత్తున రోడ్డుపై బైఠాయించారు. శంకర్ పల్లి వైపు, గండిపేట హైదరాబాద్ వైపు వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి.






