పార్టీలకు అతీతంగా అభివృద్ధే లక్ష్యం : ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి

by Nallavelli.Anjaneyulu |

పార్టీల‌కు అతీతంగా అభివృద్ధే ల‌క్ష్యం అని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి పేర్కొన్నారు.

పార్టీలకు అతీతంగా అభివృద్ధే లక్ష్యం : ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి
X

దిశ, హనుమకొండ కలెక్టరేట్ : పార్టీల‌కు అతీతంగా అభివృద్ధే ల‌క్ష్యం అని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి పేర్కొన్నారు. బుధ‌వారం నియోజ‌క‌వ‌ర్గ ప‌రిధిలోని 52వ డివిజ‌న్, 6వ డివిజ‌న్ ల‌లో సుమారు రూ.2.30 కోట్ల‌తో అంత‌ర్గ‌త సీసీరోడ్లు, సైడ్ డ్రైనేజీలు, వ‌ర్ష‌పు నీటి పారుద‌ల స‌దుపాయ‌ల అభివృద్ధి ప‌నుల‌కు ఎమ్మెల్యే శంకుస్థాప‌న చేశారు. ఈ సందర్భంగా కాలనీలో పర్యటించిన ఎమ్మెల్యే పలు ప్రాంతాల్లో దెబ్బతిన్న డ్రైనేజీ పరిస్థితులను స్వయంగా గమనించారు. వెంటనే సంబంధిత అధికారులను పిలిపించి మరమ్మత్తులు చేపట్టాలని ఆదేశాలు జారీ చేశారు. ప్రజలకు అసౌకర్యం కలగకుండా తక్షణ చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు.


నైం నగర్ ప్రధాన నాలాకు అనుసంధానంగా ఉన్న కాలనీల నాలాలను పరిశీలించిన ఎమ్మెల్యే, డ్రైనేజీ నిల్వలు తరచుగా ఏర్పడకుండా సమయానుకూలంగా శుభ్రపరిచే చర్యలు తీసుకోవాలని మున్సిపల్ శాఖ అధికారులకు సూచించారు. వర్షాకాలంలో నీటి నిల్వల సమస్య తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నాయిని మాట్లాడుతూ ప్రతి డివిజన్‌లో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను క్షేత్రస్థాయిలో తెలుసుకుని పరిష్కరిస్తున్నాం. రోడ్లు, డ్రైనేజీలు, తాగునీటి సదుపాయాలు వంటి ప్రాథమిక అవసరాలు మెరుగుపడితేనే జీవన ప్రమాణాలు మెరుగవుతాయి అని అన్నారు. అభివృద్ధి పనుల్లో నాణ్యతకు ప్రాధాన్యం ఇవ్వాలని, నిర్దిష్ట గడువులో పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు చాడ స్వాతి, చెన్నం మధు, మాజీ డిప్యూటీ మేయర్ అశోక్ రావు, డివిజన్ అధ్యక్షులు తడుక సుమన్, శివాజీ నాయకులు బొమ్మతి విక్రమ్,సుగుణకర్ రెడ్డి, బాలు, దేవేందర్ రెడ్డి, లక్ష్మణ్, అశ్విన్ పాల్గొన్నారు.

Next Story