- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పోరాటయోధురాలి చాకలి ఐలమ్మ
తెలంగాణ సాయుధ పోరాటంలో అగ్రభాగంలో నిలిచిన ధైర్యవంతురాలు చాకలి ఐలమ్మ అని వరంగల్ పశ్చిమ నియోజకవర్గ శాసన సభ్యులు నాయిని రాజేందర్ రెడ్డి అన్నారు.

పోరాటయోధురాలి చాకలి ఐలమ్మ
ఆమె జీవితం నేటి తరానికి స్ఫూర్తిదాయకం
నివాళులర్పించిన వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి
దిశ, వరంగల్ బ్యూరో: తెలంగాణ సాయుధ పోరాటంలో అగ్రభాగంలో నిలిచిన ధైర్యవంతురాలు చాకలి ఐలమ్మ అని వరంగల్ పశ్చిమ నియోజకవర్గ శాసన సభ్యులు నాయిని రాజేందర్ రెడ్డి అన్నారు. హనుమకొండ జిల్లా వెనకబడిన తరగతుల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం ఏర్పాటు చేసిన చాకలి ఐలమ్మ జయంతి కార్యక్రమంలో వరంగల్ పార్లమెంట్ సభ్యులు కడియం కావ్య,నగర మేయర్ గుండు సుధారాణి గారితో కలిసి పాల్గొన్నారు. స్థానికంగా ఉన్న చాకలి ఐలమ్మ విగ్రహానికి ప్రజా ప్రతినిధులు, అధికారులతో కలిసి పూలమాల వేసి నివాళులు అర్పించారు. చాకలి ఐలమ్మగారి పోరాటం నేటి యువతకు ఒక గొప్ప స్ఫూర్తి అని ఎమ్మెల్యే అన్నారు. ఆమె సామాన్య వర్గానికి చెందినప్పటికీ, సామాజిక అసమానతలకు, భూ దోపిడీకి, జమీందారీ శాసనానికి వ్యతిరేకంగా పోరాడారన్నారు. ఆమె ధైర్యం, పట్టుదల మనందరికీ ఆదర్శం కావాలి అని తెలిపారు. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్,మేయర్ చాహత్ బాజ్ పాయ్,మునిసిపల్ ఫ్లోర్ లీడర్ తోట వెంకటేశ్వర్లు,స్థానిక డివిజన్ కార్పొరేటర్ మామిండ్ల రాజు యాదవ్,డివిజన్ అధ్యక్షులు సురేందర్,కుమార్ యాదవ్ మరియు ఇతర ప్రజా ప్రతినిధులు,అధికారులు,ఐలమ్మ అభిమానులు తదితరులు పాల్గొన్నారు.






