వడదెబ్బతో వ్యవసాయ కూలీ మృతి..

by Taduka Kalyani |

వడదెబ్బతో వ్యవసాయ కూలీ మృతి చెందిన సంఘటన మంగళవారం దుగ్గొండి మండల పరిధి స్వామిరావుపల్లి గ్రామంలో జరిగింది.

వడదెబ్బతో వ్యవసాయ కూలీ మృతి..
X

దిశ, దుగ్గొండి: వడదెబ్బతో వ్యవసాయ కూలీ మృతి చెందిన సంఘటన మంగళవారం దుగ్గొండి మండల పరిధి స్వామిరావుపల్లి గ్రామంలో జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. దుగ్గొండి ముప్పారపు సారయ్య (67) వ్యవసాయ కూలీ. మంగళవారం సారయ్య స్వామిరావుపల్లి గ్రామానికి మిరపతోట కూలీ పనికి వెళ్లాడు. పని ముగిసిన అనంతరం మధ్యాహ్న సమయంలో ఎండ తీవ్రత ఎక్కువగా ఉండడంతో పక్కనే ఉన్న వేపచెట్టు వద్ద సేదతీరుతున్నాడు. ఈ క్రమంలోనే ఆకస్మాత్తుగా అక్కడికక్కడే కుప్పకూలి మృతి చెందాడు. మృతుడి సారయ్య కుటుంబాన్ని ఆర్థికంగా ప్రభుత్వం ఆదుకోవాలని స్థానికులు కోరుతున్నారు.

Next Story